గాసిప్స్ : ప్రభాస్ “స్పిరిట్” కోసం మరీ ఇలాంటి హీరోయిన్ ని తీసుకుంటున్నారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి రీచ్ లో ఉన్నాడో మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలు చేస్తుండగా వాటిలో మరికొన్ని ఇంకా షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉన్నాయి.

ఆ చిత్రాల్లో అయితే తన ఫస్ట్ రెండు సినిమాలు తోనే ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో కూడా రచ్చ లేపిన దర్శకుడు సందీప్ వంగ తో ప్లాన్ చేసిన సినిమా “స్పిరిట్” కూడా ఒకటి. దీనిని అయితే ఏకంగా పాన్ ఆసియా భాషల్లో కూడా అనౌన్స్ చేయగా దీనిపై భారీ లెవెల్ క్రేజ్ నెలకొంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్నారని పలు గాసిప్స్ వినిపిస్తుండగా ఓ హీరోయిన్ పేరు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్టుగా టాక్ మొదలైంది. మరి ఈ సినిమాకి కూడా బాలీవుడ్ హీరోయిన్ నే ఎంపిక చేస్తుండగా ఆమె మరెవరో కాదు కరీనా కపూర్ అన్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ తో కరీనా కపూర్ హీరోయిన్ అంటే కాస్త ఆలోచించాల్సిన అంశమే అని చెప్పాలి. కరీనా ఇప్పుడు అవుట్ డేటెడ్ హీరోయిన్ పైగా ప్రభాస్ పక్కన ఇంకా ఏజ్డ్ గా కనిపిస్తుంది. మరి ఈ గాసిప్స్ అయితే నిజం ఎంతవరకు ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది కూడా చూడాలి.