పై బటన్స్ విప్పేసి దీపావళి విషెష్ ..డబ్బులు కోసమే ఈ పని?

“లోఫ‌ర్” సినిమాలో మెగా హీరో వ‌రుణ్ తేజ స‌ర‌స‌న న‌టించిన దిషా ప‌టానీ గుర్తుందా? ఆ ఒక్క సినిమాతోనే ఆమెకి తెలుగులో తనకి ఎంత సీన్ ఉందో అర్థ‌మైం మళ్లీ ఇటువైపు అడుగు పెట్టలేదు. తనకి న‌ట‌న రాక‌పోయినా.. మంచి శ‌రీరాకృతి ఉందనే విషయం ఆమెకు తెలుసు.

ఆ ఎస్సెట్‌ని చూపించే ఆమె బాలీవుడ్‌ దున్నేసే పనిలో పడింది. అలాగే బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాప్‌కి గాళ్ ఫ్రెండ్‌ కావటం కూడా కలిసొచ్చే అంశమే. అయితే సినిమాలతో సరిపెట్టుకోకుండా కార్పోరేట్ యాడ్స్ తో డబ్బులు సంపాదిస్తోంది.

అందుకు తన హాట్ బాడీనే అడ్డం పెట్టుకుంటోంది. తాజాగా దిషా వార్త‌ల్లో నిలిచింది. దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్తూ సెక్సీ డ్రస్ లో ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. సంప్రదాయ గాంగ్రా చోళీ ధ‌రించింది. ఐతే ఎక్కడ విప్పితే కుర్రాళ్లు పిచ్చెక్కిపోతారో తనకు తెలుసు. అందుకే త‌న‌దైన శైలిలో చోలీ బ‌ట‌న్స్‌ని విప్పేసి.ఇలా ఫోజు ఇచ్చింది.

అయితే ఇలా విప్పి ఫోజులు ఇవ్వటం వెనక ఓ స్ట్రాటజీ ఉందని అంటున్నారు బాలీవుడ్ జనం. ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ లో దుస్తుల్ని ధరించి ఫోజు ఇచ్చింది. ఈ ఫొటో ఎంతలా వైరల్ అయితే అంతలా కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కు ప్రచారం సాగుతుందనేదే ఆమె అసలు ఆలోచన అంటున్నారు. దీపావళిని అడ్డం పెట్టి డబ్బులు తీసుకుని ఇలా ఓ బ్రాండ్ పబ్లిసిటీ మొదలెట్టిందన్నమాట. అదీ విషయం.