అందాలు ఆరబోయటంలో బాలీవుడ్ భామలు..హాలీవుడ్ అందగత్తెలకు ఓ రేంజిలో పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా దిశా పటాని, ఇషా గుప్తా వంటి వాళ్లు అయితే రోజుకో రకంగా తమ అందాల ప్రదర్శన పోగ్రాం పెట్టి కుర్రాళ్లను చంపేస్తున్నారు.
తెలుగులో లో లోఫర్ చిత్రంతో పరిచయమైన దిశాపటానికు ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ ఛాన్స్ లు రాలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం బిజీ అయ్యిపోయింది . కాకపోతే అక్కడ కూడా ఓ మెలిక ఉంది. దిశా…సినిమాల్లో నటించడం తో ఎక్కువగా పాపులర్టి రాలేదు. స్కిన్ షో చేయటంలోనే రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది.
ఇప్పటికే చాలా సార్లు టూ పీస్ బికినీ తో రచ్చ రచ్చ చేసిన దిశా పటాని తాజాగా ఇన్నర్ వేర్ లో మరోసారి దర్శనం ఇచ్చి కుర్రాళ్లలో కాక రేపుతోంది. అసలే చలికాలం…ఆపై అంటూ కుర్రాళ్లు ఆమె అందాలు చూసి పాటలు పాడుకుంటున్నారు. రకరకాల భంగిమల్లో దిశా అందాలు దశ దిశలా మోతిక్కిస్తున్నాయి .
ఈ ఫోటోలో ఆమె లింగరీలో కనపడి షాక్ ఇచ్చింది. ఆ ఫోటో మీరు ఇక్కడ చూడవచ్చు. కాల్విన్ క్లైన్ ఇండియా బ్రాండ్ స్పోర్ట్స్ బ్రా, లింగరీ ప్రమోషన్ కోసం ఇదంతా అని తెలుస్తోంది. ఈ ప్రమోషన్ నిమిత్తం ఆమెకు భారీగానే డబ్బు ముట్టినట్లు సమాచారం.
ఇక పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే..తనతో బాఘీ లో చేసిన టైగర్ ష్రాఫ్ తో దిశా డేటింగ్‌లో ఉన్నారని కొద్దికాలంగా ప్రచారం సాగుతున్నా దీనిపై వీరిద్దరూ ఇంతవరకూ నోరుమెదపలేదు. దిశా, టైగర్‌లు కలిసి పలు సందర్భాల్లో కెమెరాల కంటికి చిక్కుతూనే ఉన్నారు.
ఈ విషయమ ఆమె మాట్లాడుతూ… టైగర్ ష్రాఫ్ తనకు మంచి స్నేహితుడని, తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాడని చెప్పుకొచ్చారు. టైగర్ పాటించే నియమాలు, పని పద్ధతులు ప్రతిఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని ప్రశంసించారు. టైగర్ అందరికీ ఆదర్శప్రాయుడుని కితాబిచ్చారు. ఇక సినిమాల పరంగా దిశా పటానీ సల్మాన్ ఖాన్‌కు జోడీగా భరత్‌లో నటిస్తోంది.