సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ఎన్నో ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కుటుంబ సభ్యులు సైతం ఆత్మహత్య కాదని ఆరోపించడంతో ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్నారు. ఇప్పటికీ సుషాంత్ చనిపోయిన నెలరోజులు దాటిపోయింది. అయినా సుషాంత్ పై సోషల్ మీడియాలో కథనాలకి మాత్రం బ్రేక్ పడలేదు. రోజు ఏదో వార్తతో సుషాంత్ ని గుర్తు చేసుకునే పరిస్థితి. కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు రోజుకొకర్ని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మాజీ `రా `అధికారి సుషాంత్ ని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చంపాడని ఓ వీడియో రిలీజ్ చేసాడు.
దీంతో ఆ కోణంలోనూ కేసును విచారించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర సంగతి బయటకు వచ్చింది. సుషాంత్ ఆత్మతో మాట్లాడానంటూ ఓ పారానార్మల్ యాక్టవిస్ట్ స్టీవ్ హుప్ ముందుకొచ్చాడు. ఈ వృత్తిలో దాదాపు 10 ఏళ్లగా కొనసాగుతున్నాడుట. ఆత్మలతో మాట్లాడటం ఆయనకు ఓ హాబీ లాంటిందిట. దీనికి సంబంధించి ఎన్నో పరికరాలను కనిపెట్టానని వెల్లడించాడు. జులై 13న ఆస్ర్టల్ డోర్ వే సహాయంతో సుషాంత్ తో మాట్లాడానని స్టీవ్ అంటున్నాడు. తమ ఇద్దరి మధ్య ఇంకా సంభాషణ జరుగుతుందని తెలిపాడు. ఆత్మలు ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటాయని అంటున్నాడు.
మనిషి చనిపోయినా ఆత్మలు తమకు కావాల్సిన వాళ్ల చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయని…వాటికి చావు అనేది ఉండదన్నాడు. సుషాంత్ ఆత్మతో పాటు ఒక మగ ఆత్మ..మరో మహిళ ఆత్మ ఉన్నాయన్నాడు. ఇది ముగిసిన కథ అని ఓ మహిళ ఆత్మ తనతో చెప్పినట్లు స్టీవ్ చెప్పాడు. ఇందులో నిజం..ఉందో లేదో తెలియదు గానీ! సుషాంత్ ఆత్మతో మాట్లాడాని స్టీవ్ మాత్రం బాగా పాపులర్ అవుతున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటివరకూ చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కానీ ఏ సెలబ్రిటీ విషయంలో ఇంత హడావుడైతే జరగలేదు.