బాక్సాఫీస్ : బాలీవుడ్ గడ్డు కాలం..”లాల్ సింగ్ చద్దా” 2 రోజుల్లో డిజాస్టరస్ వసూళ్లు.!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఒక్క బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తప్ప మిగతా అన్ని సినీ పరిశ్రమలు కూడా భారీ సక్సెస్ లు వసూళ్లతో లాభాలలో ఉన్నాయి. కానీ బాలీవుడ్ లో పరిస్థితి ఎప్పుడో తల కిందులు అయ్యిపోయింది. మధ్యలో ఒకటి అరా సినిమాలు మంచి వసూళ్లు సాధించినా మన టాలీవుడ్ కన్నా అక్కడ పరిస్థితి దారుణంగా మారింది.

అక్కడి స్టార్ హీరోల సినిమాలు కూడా మినిమమ్ ఓపెనింగ్స్ అందుకోవట్లేని పరిస్థితి ట్రేడ్ వర్గాలకి షాకింగ్ గా మారింది. అయితే ఈ పరిస్థితి బాలీవుడ్ బిగ్ స్టార్స్ లో ఒకరైన అమీర్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “లాల్ సింగ్ చద్దా” తో మారొచ్చు అనుకున్నారు కానీ ఈ సినిమాకి కూడా ఆడియెన్స్ షాకివ్వడంతో బాలీవుడ్ కి గడ్డు కాలం ఇంకా కొనసాగుతుంది.

మరి ఈ సినిమా వసూళ్లు పరంగా చూస్తే అమీర్ కెరీర్ లోనే ఈ సినిమాకి దారుణ వసూళ్లు నమోదు అయినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సినిమాకి అయితే మొదటి 11.6 కోట్లు వసూలు కాగా రెండో రోజు కేవలం 7 కోట్లు మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అప్పట్లో అమీర్ సినిమాలు మినిమమ్ 10 కోట్లు నుంచి స్టార్ట్ అయ్యి 300 కోట్ల మార్క్ దగ్గర ఆగిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ డే 2 నుంచే మంచి గ్రోత్ ని అవి అందుకున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితి కనపడలేదు దీనితో అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిపోవడం ఖాయం అని చెప్పాలి.