షాకింగ్ : వింత వివాహంతో వైరల్ అవుతున్న హిందీ ప్రముఖ నటి..!

తెలుగు సినిమాలో కన్నా పెళ్లి, ఇతర డేటింగ్ విషయాల్లో బాలీవుడ్ అలాగే హిందీ సినిమా నుంచి కాస్త ఆసక్తికరమైన ఘటనలు ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. అయితే ఇప్ప్పుడు వాటికన్నా వింత రిలేషన్ షిప్ కోసం సోషల్ మీడియాలో ఓ అంశం ఆసక్తిగా మారింది.

ఇక ఈ వింత న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్లినట్టయతే హిందీలో కూడా పలు పాపులర్ సీరియల్స్ ఉన్నాయి. మరి ఆ సీరియల్స్ లో కీలక పాత్రల్లో కనిపించిన యంగ్ నటి కనిష్క సోనీ పెళ్లి చేసుకొని షాకిచ్చింది. పెళ్లి చేసుకోడం షాకేముంది అనుకుంటున్నారా? ఉంది..

ఇంతకీ ఆమె ఎలాంటి పెళ్లి చేసుకుందంటే తనని తానే పెళ్లి చేసుకుందట. అవును మీరు చదివింది నిజమే.. ఆమె తనని తానే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇలాంటి ఘటన నార్త్ లో ఆ మధ్య కూడా ఒకటి జరిగింది. దీనినే ‘సోలోగమి’ అని అంటారు.

ఇలా ఆమె తనని తానే పెళ్లి చేసుకొని నుదుట సిందూరం కూడా పెట్టుకొని అందరికీ షాకిచ్చింది. అయితే ఆమె ఈమె ఎప్పుడో ఈ పెళ్లి చేసుకున్నట్టుగా తెలిపినా సడెన్ గా ఈ మేటర్ ఇప్పుడు ఇప్పుడు ఈమె చేసుకున్న పెళ్లి సినీ వర్గాల్లో మరియు బాలీవుడ్ లో వైరల్ గా మారింది.