బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై నటి కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలతో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. సుషాంత్ మరణాన్ని ఆమె రెండవ కోణంలో విశ్లేషించి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తను అనుభవం..నాలెడ్జ్ అంతటిని క్రోడీకరించి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. పరిశ్రమలో ఎదిగేవారిని చూసి ఓర్వలేక కొంత మంది పెద్ద మనుషులు చేసే పనులకు అమాయకుల నూరేళ్ల బంగారు భవిష్యత్ ని మధ్యలో చిదిమేస్తున్నారు అన్న డానికి సుషాంత్ ని ఓ ఉదహారణ గా కంగన చెప్పుకొచ్చింది. అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా…ఎదుగుతున్నాడు అన్న కక్షతో అవమానాలకు గురి చేసారని పలువురు సెలబ్రిటీలు ట్వీట్లను బట్టి అర్ధమవుతోంది.
సుషాంత్ కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నట్లు అది ఆత్మహత్యకాదు..హత్యకు ప్రేరేపించింది పెద్దలే అన్నట్లు బట్టబయలవుతోంది. దీంతో సోషల్ మీడియాలో సుషాంత్ అభిమానులు, స్నేహితులు తన ఎదుగుదలను ఓర్వలేక కొంత మంది చేసిన పనికే సుషాంత్ ని కోల్పోవాల్సి వచ్చిందని మండిపడుతున్నారు. అటు శేఖర్ కపూర్ వివేక్ ఒబెరాయ్ ప్రకాష్ రాజ్ లాంటి ట్వీట్లు అంతకంతకు వేడేక్కించాయి. తాజాగా దర్శక నిర్మాత నటుడు ఫర్హాన్ అక్తర్ ట్విట్టర్ వేదికగా సుశాంత్ మృతిపై స్పందించారు. పర్హాన్ భావోద్వేగంతో కూడిన కవితను ట్విటర్లో పోస్ట్ చేసాడు.
నిద్రపో నా సోదరా నిద్రపో…రాబందులు నీ చుట్టూ గుమిగూడనివ్వు.. మొసలి కన్నీళ్లు కార్చనివ్వు.. సర్కస్ లో మాదిరిగా కొందర్ని తమ ప్రదర్శనను కొనసాగించనివ్వు.. నీ వద్ద మోకరిల్లనివ్వు.. నీ గురించి కీచురాళ్ల శబ్దాలు చేయనివ్వు.. మనుషుల్లో అజ్ఞానం ఇంకా పెరుగనివ్వు.. ఘాడ నిద్రలోకి జారుకో నా సోదరా నిద్రపో” అంటూ ఫర్హాన్ ‘సుశాంత్ ఆత్మకు కలిగేలా ప్రార్ధించాడు. పర్హాన్ ట్వీట్లు బాలీవుడ్ లో చర్చాంశనీయంగా మారాయి. సినిమాల్లోకి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే తొక్కేస్తారు అని కంగన చేసిన వ్యాఖ్యలకు పర్హాన్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. దీంతో సుషాంత్ మరణంలో బాలీవుడ్ పెద్దలు భాగస్వాములే అంటూ కామెంట్లు పడుతున్నాయి.