బాలీవుడ్ నటి,ఐటం గర్ల్ రాఖీ సావంత్ క్రియేట్ చేసే వివాదాల గురించి తెలియనివారెవరూ ఉండరు. 1978, నవంబరు 25 న జన్మించిన రాఖీ సావంత్ ఈ రోజు తన 40వ పుట్టినరోజు చేసుకుంటోంది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ తన పుట్టినరోజు నాడు ఏమిచేయనుందో మీడియా ఎదురుచూస్తోంది.
ఈ లోగానే ఆమె తన పుట్టిన రోజు రచ్చ మొదలెట్టేసింది. ముంబై లోని లవ్ అండ్ ఐస్ క్రీమ్ అనే పార్లర్ కు వెళ్లింది. అక్కడ తన సెక్సీ అందాలు చూపిస్తూ ప్రమోషన్ మొదలెట్టి..ఆ వీడియోలను ఇనిస్ట్రగ్రమ్ లో షేర్ చేసింది. ఆ వీడియోలు మీరు ఇక్కడ చూడవచ్చు.
రీసెంట్ గా తనుశ్రీ దత్తా ‘మీ టూ’ వివాదంలో రాఖీ సావంత్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ గొడవ చల్లారకముందే రాఖీ సావంత్‌ను ఒక మహిళా రెజ్లర్ చేతులతో ఎత్తి కిందపడేసి గాయపరిచిన విషయం విదితమే. ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది.
అంతకు ముందు రాఖీ సావంత్ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, ఆయన కూడా ఇందుకు సమ్మతి తెలిపారంటూ వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసింది.