అన్ని అయిపోయిన నిన్ను చేసుకుంటోంది ఎవరు?
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ రహస్యంగా వివాహం చేసుకున్నారని ప్రచారం నిన్నటి నుంచీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ముంబయి హోటల్‌లో ఓ ఎన్నారైతో ఆమెకు పెళ్లి జరిగినట్లు వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు రాశారు. అయితే దీనిపై రాఖీ క్లారిటీ ఇచ్చారు. ఈలోగా సోషల్ మీడియా ఈ వార్తను సెలబ్రెటే చేసేసింది. దాంతో రకరకాల కామెంట్స్ ఈమె పెళ్లి వార్తపై జనాలు రాయటం మొదలెట్టారు.
ఆ కామెంట్స్ లో కొన్ని మరీ వల్గర్ గా ఉండగా, మరికొన్ని ఫన్నీగా ఉన్నాయి. అవి రాఖీ సావంత్ వాటిని లైట్ తీసుకుంది. కొన్ని కామెంట్స్ లో అన్ని అయిపోయిన నిన్ను పెళ్లి చేసుకునేవాడు ఎవడు అనే అర్దం వచ్చేలా కామెంట్స్ చేసారు.
అయితే ఫైనల్ గా రాఖీ సావంత్ తనకు పెళ్లి కాలేదని స్పష్టం చేశారు. హోటల్‌లో బ్రైడల్ ఫొటోషూట్ జరిగిందని పేర్కొన్నారు. ‘జేడబ్యూ మారియట్ హోటల్‌లో బ్రైడల్ షూట్ జరిగింది. నాకు పెళ్లి జరిగిపోయిందని జనాలు ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదు. నాకు వివాహం కాలేదు. నేను ఎవరితోనూ ప్రేమలో లేను. నేను సింగిల్‌గా ఉన్నా’ అని చెప్పారు.
ఇక ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షో కంటెస్టెంట్ దీపక్ కలాల్‌ను వివాహం చేసుకోబోతున్నానంటూ గత ఏడాది రాఖీ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశారు. లాస్ ఏంజెల్స్‌లో పెళ్లి జరగనుందని కూడా చెప్పారు. ఆ తర్వాత పెళ్లి జరగడం లేదని ప్రకటించారు. ‘నన్ను క్షమించు దీపిక్. నేను చాలా మంచి అమ్మాయిని. మా అమ్మ, సోదరుడు నా వల్ల బాధపడుతున్నారు. ఎంతో కష్టపడి నేను ఇప్పుడున్న ఈ స్థాయికి వచ్చాను’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు.