బాలీవుడ్ మీడియా ఎదురు చూస్తున్న విషయం రివీల్ అయ్యిపోయింది. గత కొంతకాలంగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ మధ్య జరుగుతున్న విషయాన్ని అఫీషియల్ గా ఒప్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే మొదట వీళ్లిద్దరి మధ్యనా ఏమీ లేదని ఎవరికి వాళ్లే చెప్పినా…ఇప్పుడు కలిసి కాపురం పెట్టేసారు. బాగా ఓపెన్ గానే కలిసి తిరుగుతున్నారు. ఎవరేమి అనుకుంటే మాకేంటి అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు.
తనకన్నా పన్నెండేళ్లు పెద్దదైన మలైకా అంటే పిచ్చి ప్రేమను చూపిస్తున్నారు. అయితే పెళ్లి చేసుకోవానికి మాత్రం ఇష్టం చూపటం లేదు. అప్పుడే నాకు పెళ్లి వయస్సు ఏమొచ్చింది అంటున్నాడీ 33 ఏళ్ల కుర్ర హీరో. చక్కగా ప్రియాంక చోప్రా తనకన్నా వయస్సు తక్కువ ఉన్నవాడిని చేసుకుంది కదా ..అలాగే నువ్వు ముందుకు వెల్లిపోవచ్చు కదా…అంటే మా ఇంట్లో అభ్యంతకరం ఏమీ లేదు. అయితే మేమిద్దరమే పెళ్లి గురించి ఆలోచించటం లేదు అని నవ్వేసి వెళ్లిపోతున్నాడు.
పెళ్లి కాకపోతేనేం ముంబైలోని కొత్త ఇంట్లో ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే ఆ మూడు ముళ్ళ విషయంలోనే మొహమాట పడుతున్నారు. పెళ్లి చేసుకుంటే ఇంక కిక్ ఏముంటుంది అని కేవలం కలిసి తిరగడానికి ప్రయారిటి ఇస్తున్నాడు. అయినా మా రిలేషన్ షిప్ కూడా దాచాలని అనుకోవడం లేదని చెబుతున్నాడు అర్జున్ కపూర్.