షాహిద్ కపూర్ తో సేమ్ సెక్స్ రిలేషన్ షిప్ కావాలి

గతంలో కొన్ని విషయాలు మాట్లాడాలంటే సెలబ్రెటీలు వెనకాడేవారు. కానీ ఇప్పుడు ఏదన్నా కాంట్రవర్శి అవుతుందంటే ఆ విషయం మాట్లాడటానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ ఆ దారిని ఎంచుకున్నారు. తమ మనస్సులో ఉన్నది ఏ ఫిల్టర్ లేకుండా బయిటకు చెప్పేస్తున్నారు. తనకు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పై మనసైందని బహిరంగంగా చెప్పాడు మరో హీరో.

ఆయుష్మాన్ ఖురానా సోదరుడు అయిన అపర్ శక్తి ఖురానా …సినిమాలో డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తూంటారు. వైవిధ్యమైన పాత్ర ఉందంటే అది ఎంత వివాదాస్పదమైనదైననా చేయటానికి సై అంటాడు. అన్ కన్వెన్షనల్ రోల్స్ చేయటంలో అతనికి అతనే సాటి. దాంతో అతి తక్కువకాలంలోనే నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ఓ షోకు హాజరైన ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ షాహిద్ కపూర్ పై వాఖ్యలు చేసారు.

షాహిద్ కపూర్ డ్రస్ చేసుకునే విధానం, ఆయన స్టైల్ , బాడీ లాంగ్వేజ్ తనకు బాగా నచ్చుతుందని అన్నాడు. అంతేకాకుండా తను సేమ్ సెక్స్ తో రిలేషన్ లో ఉండదలిస్తే మాత్రం షాహిదే నే ఎంచుకుంటానని అన్నారు. ఇక తను డేటింగ్ వెళ్లాల్సి వస్తే కత్రినా కైప్ అడిగినా సరే అలియా భట్ నే కోరుకుంటాను అన్నారు. ఇక ఇంటిమేట్ సీన్ ఎవరితో చేయటానికి ఇష్టపడతారు అంటే దిశా పటాని అని మొహమాటం లేకుండా చెప్పేసాడు.