విగ్రహాలు మాట్లాడతాయా…మనతో సెల్ఫీ తీసుకుంటాయా..అంటే ..అవును…చేస్తాయి అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇదేమీ సినిమాలో సీన్ కాదు..నిజ జీవితంలోదే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ విగ్రహం స్పెషాలిటీ ఏమిటంటే…. మనుషులతో మాట్లాడే తొలి విగ్రహం ఇదే కావటం. అయితే మాట్లాడటంతో ఆగకుండా.. ఈ విగ్రహం చేతిలో ఫోన్ పెట్టుకుని సెల్ఫీ దిగడానికి ఆహ్వానిస్తుంది. దాన్ని మనం డిజిటల్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. ఈ విగ్రహాన్ని అనుష్క సోమవారం ప్రారంభించారు.
‘ఇది నిజంగా చాలా సహజంగా ఉంది’ అంటూ అనుష్క ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. కృత్రిమమేధ సహాయంతో ఈ మైనపు విగ్రహం సందర్శకులతో మాట్లాడుతుంది. దాంతో ఈ అనుష్క విగ్రహం చూడటానికి ఎక్కడెక్కడి సందర్శకులు ఎగబడుతున్నారు.
అనుష్క శర్మ కెరీర్ విషయానికి వస్తే… ప్రస్తుతం ‘జీరో’ సినిమా ప్రచారంలో బిజీగా ఉందామె. షారుక్ ఖాన్ ఇందులో హీరో గా చేస్తున్నారు. కత్రినా కైఫ్ మరో హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి … ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. డిసెంబరు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
ఇక అనుష్క ఈ ఏడాది ‘సూయీ ధాగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.