పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన కమల్ కుమార్తె

కమలహాసన్ కి శృతి హాసన్, అక్షరాహాసన్ ఇద్దరు కూతుర్లు. అందులో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక చిన్న కూతురు అక్షరాహాసన్ ప్రస్తుతం నటీగా స్థిరపడాలి అని ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈలోగా  అక్షరాహాసన్ సెమి న్యూడ్ ఫోటోలు లీక్ అయ్యాయి. దాంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కక తప్పలేదు… వివరాల్లోకి వెళితే..

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ కూతుళ్లలో శృతిహాసన్‌ కు చెందిన ప్రెవేట్ పిక్స్ లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. సెమీ న్యూడ్ గా ఉన్న ఈ ఫొటోలు ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాయి. ఈ పిక్స్ ఎలా లీక్ అయ్యాయో అర్దంకాలేదు.

రెండు రోజులు పాటు ఈ విషయమై సైలెంట్ గా ఉన్న అక్షర తన లీక్ ఫొటోలు వివిధ వెబ్ సైట్లలో పెద్ద పెద్ద వివాదస్పద హెడ్డింగ్ లతో కనపడటం చూసి షాకైంది. వాటికి వస్తున్న పబ్లిసిటీకు అడ్డుకట్ట వేయాలనుకుంది. అందుకే వెంటనే ముంబైలో సైబర్ సెల్ ని సంప్రదించి కంప్లైంట్ ఇచ్చింది.

ఇక ఈ లీకయిన సెమి న్యూడ్ ఫోటోలలో దాదాపు అన్నీ సెల్ఫీలే కావటం విశేషం. తన పర్శనల్ గదిలో ఒక్కతే ఉన్నప్పుడు లో దుస్తులు ధరించి అక్షర హాసన్ సెల్ఫీ తీసుకున్నట్టుగా అర్దమవుతోంది. అంతేకాదు ఈ ఫొటోలన్నీ ఒక్కసారి తీసుకున్న ఫోటోలు కాదు. కొన్ని ఫోటోలలో పొడవాటి జుట్టుతో ఉంటే. మరి కొన్ని ఫోటోలలో పొట్టి జుట్టుతో కనిపించింది.

మొదట అక్షర హాసన్ గానీ ఆమె కుటుంబ సభ్యులు గానీ ఈవిషయం పై ఇప్పటివరకూ స్పందించలేదు. విషయాన్ని పెద్దది చేసి మీడియా దృష్టిలో రాంగ్ రీజన్ తో హైలెట్ కావటం ఎందుకని భావించారు. అయితే ఈ ఫొటోలు వివిధ వెబ్ సైట్లలో కనిపించటం తలనొప్పి తెచ్చిందని చెప్పక తప్పదు. అక్షరా హాసన్ ఈ విషయమై ఫేస్ బుక్ లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. గతంలో కూడా శృతి హాసన్ వి ఎవడు సినిమా నుంచి కొన్ని స్టిల్స్ లీక్ అయిన విషయం అందరికి తెలిసిందే.

https://twitter.com/aksharahaasan1/status/1060194620959834113