50 ఏళ్ల వ్యక్తి.. 26 ఏళ్ల రకుల్.. మధ్యలో మాజీ భార్య

బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దే దే ప్యార్‌దే’. అకీవ్‌ అలి దర్శకత్వం వహించారు. ఈరోజు అజయ్‌ 50వ పుట్టినరోజును సందర్బంగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

De De Pyaar De - Official Trailer | Ajay Devgn, Tabu, Rakul Preet Singh | Akiv Ali | 17 May

50 ఏళ్ల అజయ్‌ తన భార్య టబుతో విడిపోయి ఒంటరిగా ఉంటాడు. ఆయనకు 26 ఏళ్ల రకుల్‌తో పరిచయం ఏర్పడి ప్రేమపుడుతుంది. రకుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న క్రమంలో టబు మళ్లీ అజయ్‌ జీవితంలోకి వస్తుంది. అలా మాజీ భార్య, ప్రేయసి మధ్య అజయ్‌ ఎలా ఇరుక్కున్నారు? అన్నదే కథ. అన్ని వర్గాలు వారు చూడగలిగే రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

2017లో విడుద‌లైన గోల్‌మాల్ ఎగైన్ చిత్రం నేప‌థ్యంలోనే దేదే ప్యార్ దే చిత్రం ఉంటుంద‌ని అంటున్నారు. జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్‌, అలోక్ నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.