నటి ఐశ్వర్యారాయ్- కుమార్తె ఆద్య లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇరువురు హోమ్ క్వారైంటన్ లో ఉన్నారు. డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకుంటు చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఐశ్వర్యారయ్ ని తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. దీంతో ఐశ్వర్యారాయ్ ని హుటాహుటిన ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. ఆమెతో పాటు ఆద్య కు ఇదే సమస్యతలెత్తడంతో ఇద్దర్నీ ఒకేసారి ఆసుపత్రికి తలరించినట్లు తెలిసింది. ఇరువుర్ని వెంటనే డాక్టర్లు ఐసీయూకి తరలించి చికిత్స అందించినట్లు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.
దీంతో ఐశ్వర్యారాయ్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కోవిడ్ మరణాలు ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతోనే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఐశ్వర్యారాయ్-ఆద్యలకు కూడా శ్వాసతీసుకోవడమే ఇబ్బందిగా మారింది. దీంతో తమ అభిమాన తార ఆరోగ్యంపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అభిమానులు నానావతి ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఆమె ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడం తో అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ఐశ్వర్యా రాయ్ ఆరోగ్య పరిస్థితిపై వెంటనే హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐశ్వర్యారాయ్-ఆద్య ఇద్దరు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.
ఇక ఇదే ఆసుపత్రిలో ఐశ్వర్యారాయ్ భర్త , మామలు కూడా కొవిడ్ కు చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. అందరికంటే ముందుగా అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్ వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇద్దరు వెంటనే నానావతి ఆసుపత్రిలో ఒకేసారి చేరారు. ప్రస్తుతం ఆ ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ నేపథ్యంలోనే తొలుత నిర్వహించిన పరీక్షలో ఐశ్వర్యారాయ్ కి ఫలితాల్లో నెగిటివ్ వచ్చింది. మళ్లీ మరోసారి పరీక్షించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.