హాట్ గా ఉండటం వేరు..హాట్ గా తయారు అవటం వేరు. ఉన్న అందాలను హాట్ గా ఎక్సపోజ్ చేస్తూ వార్తల్లో నిలవటం వేరు. ఈ మూడు కలిపిన అందం అదా శర్మ. ఎంత ధైర్యం లేకపోతే ఇదిగో ఇంత బోల్డ్ గా హాట్ గా ఫోజులిస్తుంది. ఆమె తన అభిమానులకు ఇలా కనపడి పండుగ చేస్తోంది. లక్స్ గోల్డెన్ అవార్డ్స్ 2018కు హాజరైన ఈ ముద్దు గుమ్మ తన అందాలను ఆరబోయటంలోనే దృష్టి మొత్తం పెట్టిందని అర్దమవుతోంది కదా.
ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ ఆ సినిమాతో యూత్ గుండెలను అలా అల్లకల్లోలం చేసేసింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆమెకు పూర్తి పేరు వచ్చేసింది. దాంతో ఆమె సోకులకు దాసోహం అన్న దర్శక,నిర్మాతలు ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయమే అనుకున్నారంతా. అందుకు తగ్గట్లే ఆ తర్వాత చాలా సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి.
దీంతో చాలా చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా సరే అనుకుని కెరీర్ లో సర్దుకుపోవటం నేర్చుకుంది. ఇక బాలీవుడ్‌లోనూ ‘1920’ సినిమా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇప్పుడు రాజశేఖర్ చిత్రం కల్కిలో చేస్తోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా..ఇలాంటి ఫొటోలతో సోషల్ మీడియాలో మాత్రం ఈ పూరీ పోరీ మహా యమా యాక్టివ్‌గా ఉంటోంది.