సోనుసూద్ పై ఇప్పుడు ఇంకెన్ని రాజ‌కీయాలో

బాలీవుడ్ న‌టుడు సోనుసూద్ వ‌ల‌స‌కార్మికుల‌ను ఆదుకోవ‌డంలో చూపించిన చోరవ గురించి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా మ‌హ‌రాష్ర్ట‌లో లో ఇరుక్కుపోయిన కార్మికులంద‌ర్నీ స్వ‌రాష్ర్టాల‌కు సొoతడ‌బ్బు ఖ‌ర్చు చేసి త‌ర‌లించారు.వేలాది మందిని బ‌స్సులేసి సోంతుళ్ల‌కు పంపించారు. ప్ర‌భుత్వాలే చేయ‌లేని ప‌నిని సోనుసూద్ చేసి చూపించాడు. ఈ విష‌యంలో వ‌ల‌స కార్మికుల ప‌ట్ల సోనూ సూద్ దేవుడ‌య్యాడు. ప్ర‌జ‌ల గుండెల్లో రియ‌ల్ హీరో అయ్యాడు. ఆయ‌న సేవ‌ల్ని చూసి ఎన్నో రాజ‌కీయ పార్టీలో త‌మ పార్టీలో చేరాల‌ని ఆహ్వానించాయి. నువ్వు రాజ‌కీయాలు చేయాలంటే ఇదే స‌రైన స‌మ‌యం అంటూ ప‌లు రాష్ర్టాల సీఎంలు సైతం స‌ల‌హా ఇచ్చారు.

కానీ మ‌హ‌రాష్ర్ట‌లో అధికార పార్టీ శివ‌సేన స‌హా ప‌లు పార్టీలు మాత్రం పెద్ద ఎత్తున ఈ సేవా కార్య‌క్ర‌మాన్ని కూడా రాజ‌కీయం చేసే ప్ర‌త‌య్నం చేసాయి. ఉద్ద‌శ్ ఠాక్రేని పేల‌వంగా చూపించ‌డానికి బీజేపీ వేసిన ఎత్తుగ‌డ అని ఆరోపించాయి. బీజేపీ పార్టీ డ‌బ్బులిస్తే సోనుసూద్ ఆ సేవా కార్య‌క్ర‌మాలు అన్నింటిని నిర్వ‌హిస్తున్నార‌ని ఆరోపించాయి. వీటికి సోనుసూద్ అదే స్థాయిలో బ‌ధులిచ్చారు. తాజాగా సోనుసూద్ మ‌రో మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. లాక్ డౌన్ కార‌ణంగా చ‌నిపోయిన‌, గాయాల‌పాలైన దాదాపు 400 వ‌ల‌స కార్మికుల కుటుంబాల‌ను ఆర్ధికంగా ఆదుకోవ‌డానికి ముందుకొచ్చారు. వాళ్ల భ‌విష్య‌త్ ని దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబాల‌కు ఆర్ధిక స‌హాయం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వారికి స‌హాయం చేయ‌డం త‌న వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌గా తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఆయా రాష్ర్టాల అధికారుల స‌హాయంతో బాధిత కుటుంబాల వివ‌రాలు, బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. దీంతో సోనుసూద్ తీసుకున్న నిర్ణ‌యంపై శివ‌సేన ఇంకెన్నిరాజ‌కీయాలు చేస్తుందోన‌న్న అనుమానం వ్య‌క్తం అవుతోంది. బస్సులేసి త‌ర‌లించిన‌ప్పుడే! కక్క‌లేక మింగ‌లేక చివ‌రికి ఓపెన్ అయి విమ‌ర్శ‌లు ఎదుర్కున్న శివ‌స‌నేకి ఇప్పుడు మరింత‌గా మింగుడు ప‌డ‌దేమో!