బాలీవుడ్‌కి టాలీవుడ్‌కి చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో అయినా వారి రియల్ లైఫ్స్టైల్లో అయినా. ఇక్కడ హీరోగాని, హీరోయిన్ గాని వారి అమ్మాయిలను ఇండస్ట్రీకి తీసుకురావాలంటేనే చాలా ఆలోచిస్తారు. బాలీవుడ్ విషయంలో అలా ఉండదు. అంతేకాక దారుణంగా ఎక్స్పోజ్ చేస్తూ నటించేస్తారు. అలాగే అడల్ట్ సీన్స్‌లో కూడా ఎటువంటి మొహమాటం లేకుండా చేసేస్తారు. కానీ మన టాలీవుడ్ విషయానికి వస్తే అలా ఉండదు. ఇక్కడ అసలు వారసత్వంగా అమ్మాయిలను ఇండస్ట్రీకి రావడమే ముందు ఫ్యాన్స్ ఒప్పుకోరు.
ఇక అసలు విషయానికి వస్తే… సైఫ్ అలీఖాన్- దీపికా పదుకొనే జంటగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఆజ్ కల్ అప్పట్లో ఎంతటి సంచలన సృష్టించిందో తెలిసిందే. రొమాంటిక్ లవ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తరాది ప్రేక్షకులను కట్టిపడేసిందనే చెప్పాలి. సైఫ్-దీపికా మధ్య రొమాంటిక్ సన్నివేశాల్లో అప్పట్లో ఓ సంచలనం. సైఫ్ డ్యూయల్ రోల్….దీపికా ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. తిరిగి మళ్ళీ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత లవ్ ఆజ్ కల్ సీక్వెల్ ని ఇంతియాజ్ తెరకెక్కిస్తున్నారు.
ఇందులో కార్తిక్ ఆర్యన్- సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. అప్పట్లో సైఫ్ పోషించిన పాత్రని కార్తీక్ ఆర్యన్ పోషిస్తుండగా.. ఇందులో సైఫ్ డాటర్ సారాఅలీఖాన్ సంథింగ్ హాట్ రోల్ లో నటించడం ఆసక్తికరం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంతియాజ్ తనదైన మార్క్ సినిమాని తెరకెక్కిస్తున్నారని ఇటీవలె విడుదలైన ట్రైలర్ చెబుతోంది. రొమాంటిక్ కామెడీని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు. సారా-కార్తీక్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో పాటు కావాల్సినంత ఫన్ ని కూడా పెట్టినట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది.
లిప్‌లాక్స్ పెట్టేటప్పుడు ఏమాత్రం జంకకుండా సైఫ్ డాటర్ హాట్ హాట్ గా నటించేసింది. హీరో పాత్రకన్నా హీరోయిన్ పాత్ర ను ఎక్కువగా హైలైట్ చేసినట్లు ట్రైలర్లో కనబడుతుంది. సారా డామినేటింగ్ రోల్ కు పర్ పెక్ట్ గా యాప్ట్ అయినట్లు కనిపిస్తోంది. కార్తిక్ కామెడీ టైమింగ్ ..ఇక వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ పీక్స్ అనే చెప్పాలి. కడుపుబ్బా నవ్వించే కామెడీకి కొదవలేదని ట్రైలర్ చెబుతోంది. లవ్ ఆజ్ కల్-2 సక్సెస్ కు దగ్గరగా ఉందని అప్పుడే సోషల్ మీడియాలో బోలెడన్ని కామెంట్లు వచ్చేస్తున్నాయి.