అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని అభిమానులు ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దబాయ్ లోని ఓ హోటల్ బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు పడి మరణించారు. పోలీసుల విచారణ చేస్తోన్న సమయంలో ఆమె మరణంపై రకరకాల అపోహలు.. అపార్థాలు తెలిసిందే. శ్రీదేవి మరణం ఇప్పటికీ ఓ మిస్టరీ అని కొందరి బలమైన వాదన. వీటిలో ఏది నిజం? ఏది అబద్దం? అన్నది పక్కనబెడితే శ్రీదేవి మరణం గురించి రచయిత సత్యార్ధ్ నాయక్ తాను రాసిన శ్రీదేవి బయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అందులో శ్రీదేవి మరణానికి అసలు కారణం ఇది అంటూ కుండబద్దలు కొట్టే ప్రయత్నం చేసారు.శ్రీదేవి కుటుంబ సభ్యులు, సన్నిహితుల వద్ద నుంచి సేకరించిన సమచారం అధారంగా మరణానికి సంబంధించిన విషయాలు చెప్పే ప్రయత్నం చేసారు. శ్రీదేవికి రక్త పోటు ఉందని చాల్బాజ్ దర్శకుడు పంకజ్, నాగార్జున రచయితతో చెప్పారుట. గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి బాత్ రూమ్ లో కళ్లు తిరిగి పడిపోయారు అన్న విషయాన్ని రివీల్ చేసారు. తర్వాత శ్రీదేవి మేనకోడలు మహేశ్వరిని కలిసినప్పుడు తాను కూడా ఓ సారి శ్రీదేవి బాత్ రూమ్ లో సొమ్మసిల్లి పడిపోయి కనిపించినట్లు వెల్లడించారన్నారు.
ఆ సమయంలో ముఖానికి గాయమై…రక్తం కారుతుంటే భయాందోళనకు గరైనట్లు మహేశ్వరి తెలిపినట్లు చెప్పారు. తర్వాత ఉదయం వాకింగ్ సమయంలో..ప్రాగణంలో ఉన్న బాత్ రూమ్ ల్లో ఒకసారి ఇదే సన్నివేశం చోటు చేసుకుందన్న విషయాన్ని బోనీకపూర్ చెప్పారని సత్యార్థ్ నాయక్ రివీల్ చేసారు. తాను రాసినట్లే శ్రీదేవికి తక్కువ రక్త పోటు ఉన్నట్లు బోనీ కూడా చెప్పారని రచయిత చెప్పడం విశేషం. సత్యార్ధ్ నాయక్ రివీల్ చేసిన కారణాలు చూస్తుంటే శ్రీదేవిని మరణం ముందు నుంచే బాత్ టబ్ ఘటనలు వెంటాడినట్లు తెలుస్తోంది. చివరికి నిండుగా నీటితో ఉన్న బాత్ టబ్ లో మునిగిపోయి తనువు చాలించారు. చివరికి లోబీపీ తన పాలిట మృత్యువు అయ్యిందని అర్థమవుతోంది.