బలి అయ్యేది సినీకార్మికులే.. హీరోలు కాదు !

 
కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా  భారత్‌ లో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరో పక్క  పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది.  ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌ తో థియేటర్స్‌ అన్ని మూసేశారు. మొన్నటి వరకూ సినిమాల షూటింగ్ లు ఆపేశారు. దాంతో కృష్ణ నగర్ కష్టాలు సినిమా పక్షుల్లో ఎక్కువైపోయాయి.   చిన్న నిర్మాతల దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ లు వరకూ  అందరూ తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులను ఎగురుకుంటున్నారు.  అందుకే  టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వంతో కలిసి చర్చించి  షూటింగ్ లకు అనుమతి తీసుకున్నారు. 
 

ఆయితే  ప్రస్తుతం హైదరాబాద్ లో కేసులు విపరీతంగా  పెరుగుతున్నాయి. షూటింగ్ లు ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.  దాంతో  పెద్ద నిర్మాతల దగ్గర నుండి  చిన్న నిర్మాతల వరకూ  ఎక్కువ జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది. దీంతో ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కానుంది. ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినా సినిమా రిలీజ్ కూడా కష్టంగానే ఉంది.   పైగా షూటింగ్స్ అంటే వందలమందితో చేయాల్సన పని. 

 
ఈ నేపథ్యంలో  కేంద్రం చెప్పిన 16పేజీల మార్గదర్శకాలను  షూటింగ్ స్పాట్లో తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసినా అది సాధ్యం అవుతుందా ?  షూటింగ్స్ లో  భౌతికదూరం ఎలా పాటిస్తారనేది ఇక్కడ మరో సమస్య. ఒకవేళ కరోనా సోకితే ఏమిటి పరిస్థితి..? అప్పుడు  సినిమా పక్షులకు కృష్ణ నగర్ కష్టాలతో పాటు  కరోనా కష్టాలు కూడా వస్తాయి. షూటింగ్స్  కోసం ఇప్పటివరకూ ప్రభుత్వాల చుట్టూ  పరుగులు తీసిన హీరోలు,  దర్శకనిర్మాతలు అప్పుడు ఎవ్వరూ కనిపించరు. చివరికీ  బలి అయ్యేది సినీకార్మికులే.