అర్భాజ్‌ఖాన్‌తో డైవర్స్ తీసుకుని అతనితో తన వైవాహిక బంధాన్ని తెంచుకున్న మలైకా అప్పటి నుంచి అర్జున్‌కపూర్‌తో బహిరంగంగా తిరగడం మొదలుపెట్టింది. రెండేళ్లు కావస్తున్నాడేటింగ్‌లోనే వున్న ఈ జంట బాంద్రా వీధుల్లో మీడియాకు, పబ్లిక్‌కి కనువిందు చేస్తున్నారు. పెళ్లి విషయం వచ్చేసరికి ఇప్పుడు పెళ్లేంటని దాటవేస్తున్న ఈ జంట తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వీరు ప్రేమలో ఉన్నారని వారి సాన్నిహిత్యం చూస్తే అర్థం అవుతుంది. కానీ ఆ విషయాన్ని వారు ఎప్పుడూ ప్రకటించలేదు. ప్రతి సందర్భంలో ఒకరి మీద మరొకరికి ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటారు. న్యూ ఇయర్ సందర్భంగా మలైకా..అర్జున్ ని ముద్దాడుతున్న ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది మలైకా అరోరా. ఈ ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఈ పిక్ తో ఆ వార్త నిజమనే అనిపిస్తుంది.బాధ్యతగల కుటుంబాలకు చెందిన ఈ ఇద్దరు పబ్లిగ్గా రెచ్చిపోవడం ఏమీ బాగాలేదని బాలీవుడ్ సర్కిల్స్‌లో అర్జున్‌కపూర్, మలైకాలపై సైటైర్లు పడుతున్నాయి. అర్జున్ కపూర్‌ని ముద్దాడుతున్న ఫొటోని మలైకా ఇన్‌స్టాలో పోస్త చేయడం ఆసక్తికరంగా మారింది.