మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథను తెరమీదకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్ అభిషేక్‌అగర్వాల్, ఎ.కె. ఎంటర్‌టైన్మెంట్స్ అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కలాం పాత్రను పోషించేందుకు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
చిన్నతనం నుంచే ఆయన ఆలోచనా విధానం అన్న దాని పై సినిమా తీయనున్నట్టు తెలుస్తుంది. కలాం పాత్రలో ఎవరు నటిస్తారనే అనుమానం అభిమానులలో ఉండగా, తాజాగా దీని పై క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ‘కలాం పాత్రలో నటించడం నా అదృష్టం’ అని ట్వీట్ చేశారు. తెలుగు, హిందీ , ఇంగ్లీష్ భాషలలో ఈ చిత్రం రూపొందనున్నట్టు తెలుస్తుంది. అబ్దుల్ కలాం 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.
కఠిక పేదరికంలో పుట్టిన ఆయన ఎలాంటి క్లిష్టపరిస్థితులను ఎలాంటి అడ్డంకులను ఆయన ఎదుర్కున్నారు. చివరికి రాష్ట్రపతి స్థాయికి ఎలా ఎదిగారు. ఇవన్నీ ఈ చిత్రంలో చూపించనున్నారు. 83 ఏండ్ల వయస్సులో జూలై 2015న ఐఐఎం షిల్లాంగ్‌లో ప్రసంగిస్తూ కలాం కన్నుమూసిన సంగతి తెలిసిందే ఈ చిత్రం రాజ్ చెంగప్ప వ్రాసిన కలాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనుందని సమాచారం.