విద్యాబాలన్ కీ తప్పని కాస్టింగ్ కౌచ్ వేధింపు
గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది స్టార్స్,నటీమణులు తాము పరిశ్రమలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాలను మీడియాలో బయిటపెట్టారు. ఇంకా కొంతమంది పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ సైతం తనకు సైతం ఇలాంటి చెత్త ఎక్సపీరియన్స్ ఉందని ఆవేదనగా అంది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని అంటోంది.
విద్యాబాలన్ ఆ రోజుని గుర్తు చేసుకుంటూ….. చెన్నైలో ఒక దర్శకుడు ఒక సినిమా స్టోరీలైన్ చెప్పడానికి తన దగ్గరకు వచ్చాడని.. కథను వివరించడానికి టైమ్ అడిగాడని చెప్పింది. తను అందుకు ఓకే చెప్పి.. కాఫీ షాప్ లో కలుద్దామని చెప్పగా ఆ దర్శకుడు మాత్రం తన రూమ్ కు రావాలని కోరడాని విద్యాబాలన్ చెప్పింది. రూమ్ కి ఎందుకు..? కాఫీ షాప్ లో కలుద్దామని తను చాలా సార్లు చెప్పినా.. అతడు మాత్రం రూమ్ కే రమ్మంటూ వెకిలిగా మాట్లాడాడంటూ ఆవేదనగా చెప్పుకొచ్చింది.
దాంతో అతడి ఉద్దేశాన్ని అర్ధం చేసుకొని తలుపు తెరిచి బయటకి వెళ్లమన్నట్లుగా చూడగా.. ఐదు నిమిషాలు ఎగాదిగా చూసి బయటకి వెళ్లిపోయాడని చెప్పింది. చెన్నైలో తనకు ఈ అనుభవం ఎదురైందని విద్యా చెప్పింది. అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.
అలాగే విద్యాబాలన్ తన సినిమా కెరీర్ తొలి రోజులను నెమరువేసుకుంది. మొదట యాడ్స్ నటించానన్న ఈమె..టాలెంట్ ఉన్నప్పటికీ రీజన్ చెప్పకుండానే తనను పక్కన పెట్టేవారని బాధను వ్యక్తం చేసింది. 2002లో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘రన్’ సినిమాలో మొదట హీరోయిన్గా విద్యాబాలన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లో మీరా జాస్మిన్ను ఎంపిక చేశారు.
తాను మామూలు మధ్యతరగతి నుంచి వచ్చానని, తన కుటుంబంలో ఎవరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం ఉన్నవాళ్లు లేరని విద్యాబాలన్ తెలిపింది. బాలీవుడ్లో ‘పరిణీత’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విద్యా ‘డర్డీ పిక్చర్స్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగులో ఈ భామ బాలకృష్ణ హీరోగా నటించిన‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నందమూరి బసవతారకం పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ భామ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘మిషన్ మంగళ్’ సినిమాలో లీడ్ రోల్లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.