నిత్యం వివాదాల్లో చిక్కుకునే బాలీవుడ్ హీరో ఉపద్రవాలకు స్పందించడం చాలా అరుదు. ఎప్పుడూ చూడలేదు కూడా. కానీ ఈ సారి స్పందించాడు. అయితే అందరిలా కాదు. తనదైన పంథాలో స్పందించాడు. ఇది ఆషామాషీ టైమ్ కాదు. ఏ జిందగీకా సవాల్ హై భాయ్ అంటూ కొంచెం ఘాటుగానే స్పందించడం ఆకట్టుకుంటోంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్లక్ష్యం కారణంగా ఇటలీ భారీ మూల్యం చెల్లిస్తోంది. శుక్రవారం 650 మంది, శనివారం 930 మంది ప్రాణాలు విడిచారక్కడ. వారి శవాలని మిలట్రి ట్రక్కుల్లో తరలిస్తున్న వీడియోలు, ఫొటోలు హృదయవిదారకంగా వున్నాయి. దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలని సోషల్ మీడియాలో సెలబ్రిటీలు విజ్ఞప్లి చేస్తున్నారు.
టాలీవుడ్ టు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా అందరు స్టార్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే అందరికి భిన్నం బాలీవుడ్ కండల హీరో సల్మాన్‌ఖాన్ స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. `బస్ మే ట్రైన్మే, మార్కెట్ మే..హర్ జగామే హై..దీని నుంచి తప్పించుకుని పారిపో అని కాదు..జాగ్రత్త పడమని చెబుతున్నా. జనతా కర్ఫ్యూ ఏదో పబ్లిక్ హాలీడే కాదు భయ్యా. చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. అన్నీ బంద్ చేయండి, మాస్క్ ధరించండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. చేతులు శుభ్రంగా కడుక్కోండి..నిత్యం శుభ్రంగా వుండండి.. సాటి వారికి దూరంగా వుండండి..ఇవన్నీ చేయడానికి మీకేంటి ప్రాబ్లమ్?. దీని వల్ల కొంత మంది ప్రాణాలు నిలుస్తాయి. మీ ప్రాణాలు కూడా. ఇలాంటి చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?. చేయండి గురూ.. యే జిందగీకా సవాల్ హై.. పాటించండి ప్లీజ్ ఇది నా విజ్ఞప్తి. అని సల్మాన్ కోరడం ఆకట్టుకుంటోంది.
#IndiaFightsCorona @CMOMaharashtra @mybmc @AUThackeray @Iamrahulkanal pic.twitter.com/l9qPAPs88U
— Salman Khan (@BeingSalmanKhan) March 21, 2020