‘బిగ్ బీ అమితాబ్’కు నానావతి ఆస్పత్రిలో  కరోనా చికిత్స!

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుకరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజుల నుంచి తనను కాంటాక్ట్‌ అయిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అమితాబ్ కోరిన విధానం నెటిజన్లను కదిలిస్తోంది. ప్రస్తుతం అమితాబ్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేస్తూ.. ‘నాకు కోవిడ్ పాజిటివ్ అని పరీక్షలో తేలింది. ఆసుపత్రికి తరలించారు. నా కుటుంబ సభ్యులతో పాటు సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకున్నారు, ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. గత 10 రోజులలో నాకు దగ్గరగా ఉన్న వారందరూ దయచేసి తమను తాము పరీక్షించుకోవాలని అభ్యర్థిస్తున్నాను’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం 77 సంవత్సరాల వయసున్న అమితాబ్ కరోనా బారిన పడడంతో సన్నిహితులతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.తన పాత్రలతో భారతదేశపు మొదటి “యాంగ్రీ యంగ్ మాన్”గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను కూడా పొందారు. పైగా భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటునిగా ప్రఖ్యాతి గాంచారు. ముఖ్యంగా 1970, 80లలో అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది.

అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని “ఒన్ మాన్ ఇండస్ట్రీ”గా అభివర్ణించారు అంటే అమితాబ్ స్టార్ డమ్ అంటే అర్ధం చేసుకోవచ్చు. ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుపొందారు. ఉత్తమ నటుడు కేటగిరీకిగాను 40సార్లు నామినేట్ అయి ఫిలింఫేర్ కు అతి ఎక్కువ సార్లు నామినేట్ అయిన నటుడు కూడా బచ్చనే. నటునిగానే కాక, నేపధ్య గాయునిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు ఆయన. 1980లలో రాజకీయాలలో కూడా క్రీయాశీలకంగా పనిచేశారు అమితాబ్.

 

 

https://mobile.twitter.com/SrBachchan/status/1282002456063295490