ఫైటర్ షూట్ కూడా పోస్ట్ పోనే !

డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాల కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ విజయాన్నే నమోదు చేసి ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో చేస్తోన్నాడు. కాగా షూటింగ్ కి పర్మిషన్ ఉన్నా షూట్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంది ఫైటర్ టీమ్. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగష్టు 20 నుండి మొదలుకానుందని, ఆ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ స్ తియనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని.. అయితే విజయ్ దేవరకొండ డాన్ కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని తెలుస్తోంది.

ఆ తరువత చాల భాగం డాన్ కి వ్యతిరేకంగా పని చేస్తుంటాడని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. కాగా లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడట. విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం బాగా కష్ట పడుతున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. ఇక ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యారు.