ఓ నటి అపార్ట్మెంట్లో కరోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్టమెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మలద్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ వుంది. అందులో బుల్లితెరతో పాటు సినిమాల్లో నటించే అంకిత లోఖండేతో పాటు మరి కొంత మంది బుల్లితెర నటీనలులు అక్కడే వుంటున్నారు. మార్చి నెల ప్రారంభంలో స్పెయిన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇదే అపార్ట్మెంట్లో వుంటున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు అతనికి కరోనా టెస్టులు ఇటీవల నిర్వహించారు.
తాజాగా అతనికి కరోనా పాజిటివ్ రావడంలో మలంద్ ప్రాంతంలో వున్న నటి అంకిత లోఖండే నివాసం వుంటున్న అపార్ట్‌మెంట్‌ని అధికారులు మూసి వేయడం కలకలం సృష్టిస్తోంది. మార్చి నెలలో స్పెయిన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఏయిర్ పోర్ట్‌లోనే వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించి అతన్ని 15 రోజుల పాటు స్వియ నిర్భంధంలో వుండాలని సూచించారట. అయితే 12 రోజుల తరువాత అతనికి కరోనా పాజిటివ్‌రావడంతో అతను వుంటున్న అపార్ట్‌మెంట్‌ని మూసివేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. దీంతో బయటి వారు లోనికి, లోని వారు బయటికి రావడం కష్టంగా మారింది.
దీనిపై నటి అంకిత లోఖండే స్పందించింది. తాను నివాసం వుండే అపార్టమెంట్లో స్పెయిన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతను తన ఫ్లాట్‌లోనే నిర్భంధంలోనే వున్నాడు. డాక్టర్లు, పోలీస్‌లు సేవలు అందిస్తున్నారు. పరిస్థితి ఇలా వుంటే ఇదే సమయంలో మా అత్తామామలకు సంబంధించిన మందులు అయిపోయాయి. దీంతో డాక్లర్లకు, పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే మందులు తెప్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఈ గండం నుంచి బయట పడాలంటే ఇంట్లోనే వుండాలి. అదే మనకు శ్రేయస్కరం `అని నటి అంకిత లోఖండే చెప్పింది.