సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా సర్వేల ఫలితాలు, కార్యకర్తల సూచనలు, ప్రజల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు, మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఇన్ ఛార్జ్ ల మార్పులు, చేర్పులు చేపడుతున్నారు. దీంతో… టిక్కెట్ దక్కనివారు పలువురు పార్టీలు మారే పనికి పూనుకుంటున్నారు. ఇప్పటికే ఆ పనికి పూనుకున్నవారు పశ్చాత్తాపపడి వెనక్కి తిరిగివస్తున్నారు! ఈ సమయంలో జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అవును… సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఒక పక్క అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తూనే… మరోవైపు “సిద్ధం” పేరిట పార్టీ క్యాడర్ ను ఎన్నికల సమరానికి సమయాత్తం చేస్తున్నారు. ఈ సమయంలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై కాస్త వ్యతిరేకత వస్తున్నా కూడా.. జగన్ దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే… మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవల పార్టీని వీడిన సంగతి తెలిసిందే. మంత్రి జోగి రమేష్ తో విభేదాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో… వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారని అంటుండటంతో… ఆయన స్థానంలో జడ్పీటీసీ సభ్యుడు స్వర్ణాల తిరుమలరావు పేరును వైసీపీ అధిష్టానం ఖారారు చేసిందని తెలుస్తుంది.
అయితే మైలవరం నియోజకవర్గానికి స్వర్ణాల తిరుమలరావు అభ్యర్థిత్వంపై స్థానికంగా సొంత పార్టీలో తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయని అంటున్నారు. దీంతో… మైలవరం నియోజకవర్గ అభ్యర్థి విషయంలో వైఎస్ జగన్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ నియోజకవర్గం విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని.. ఇందులో భాగంగా.. మైలవరం వైసీపీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నారని సమాచారం!
ఈ విషయంలో ఇంటర్నల్ సమస్యలు రాకుండా ఇప్పటికే నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుతో చర్చించిన తర్వాతే ముద్దరబోయిన వెంకటేశ్వరరావును వైసీపీలోకి ఆహ్వానించారని అంటున్నారు. ఈ క్రమంలోనే అంతర్గత సమస్యలకు, అసంతృప్తులకు తావులేకుండా… తాజాగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మైలవరం బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నారని తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై స్పష్టమైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది!