బిగ్ బ్రేకింగ్: పవన్‌ కు రెండు చెప్పులు చూపించిన పేర్ని నాని!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర సందర్భంగా బుధవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మైకందుకున్న పవన్… జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. తన వ్యక్తిగత జీవితంపైనా, తన రాజకీయ జీవితంపైనా, తన సినిమా కెరీర్ పైనా, ఆఖరికి తన కుటుంబ సభ్యుల పైనా జగన్ సర్కార్ కక్ష సాధిస్తుందన్నట్లుగా వ్యాఖ్యానించారు. విమర్శల వర్షం కురిపించారు.

అయితే ఇలా పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పేర్ని నాని తదనైన శైలిలో స్పందించారు. పవన్ ప్రస్థావించిన ప్రతీ అంశాన్ని తీసుకుని.. వాటిపై ప్రతివిమర్శలు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా నారాహిగా పెట్టుకోవాల్సిన వాహనం పేరును వారాహిగా పవన్‌ పెట్టుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.

ఫలితంగా అమ్మవారి పేరును రాజకీయాలకు వాడుకుంటునారంటూ విమర్శించారు. తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన పేర్ని నాని… పవన్‌ పూటకొక మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు బాగుండటం కోసం పవన్‌ ఏదైనా చేస్తాడని మండిపడ్డారు.

ఈ సందర్భంగా పవన్ ప్రస్థావించిన… “పాలించే పాలకులకు గులాంగిరీ చెయ్యం.. బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకుని అడుగుతాను” అనే కామెంట్ పై పేర్ని నాని స్పందించారు. “గతంలో చంద్రబాబు చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావ్.. మోడీ కోటు ఇంకెన్ని సార్లు పట్టుకున్నవ్” అంటూ ప్రశ్నించారు. ఇక తాను కానీ, తన ముందున్న విలేఖరులు – కెమెరా మెన్ లు కానీ… చంద్రబాబుతో పవన్ రూం లో మాట్లాడుకుని బయటకు వచ్చాక.. గంజి పెట్టిన చంద్రబాబు చొక్కా ఎప్పుడూ నలిగినట్లు కనిపించలేదని సెటైర్స్ వేశారు!

ఈ సందర్భంగా వైసీపీ నాయకులను చెప్పు చూపించి మక్కెలిరగ్గొడతానని పవన్ అంటున్నాడన్న పేర్ని నాని… తన రెండు చెప్పులనూ తీసి చూపించారు. ఇప్పుడు ఈ ఇష్యూ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అనంతరం… “పవన్ కల్యాణ్ ఇదిగో రెండు చెప్పులూ చూపిస్తున్నా.. ఇప్పుడు నేను నీకన్నా పెద్ద మొగోడ్నిగా.. జాగ్రత్త మక్కెలిరిగిపోతాయి” అంటూ ఫైరయ్యారు.

ఇదే క్రమంలో తన సినిమాలను అధికార పార్టీ అడ్డుకుంటోందంటూ పవన్ చేసిన ఆరోపణలో అర్థం లేదని నాని అన్నారు. తాము అడ్డుకున్న ఒక్క సినిమా అయిన చూపించగలవా? జగన్‌ సీఎం అయినప్పటి నుంచి నీది ఒక్క సినిమా అయినా ఆగిందా? అంటూ పవన్ కు సవాల్ విసిరారు. అనంతరం ముఖ్యమంత్రి పదవి ఒకరిస్తే తీసుకునేది కాదని, సీఎం పదవి అంటే కందులు – నువ్వెల దానం కాదని… సూచిస్తూ… పవన్‌ డ్రామాలు వేస్తే మక్కెలిరగదీస్తాం అంటూ హెచ్చరించారు.