వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ మీద పట్టు బిగిస్తున్నారా, సొంత పార్టీ నేతలను కూడ ఖాతరు చేయట్లేదా అంటే అవుననే అంటున్నాయి విశాఖ వైసీపీ వర్గాలు. మొదటి నుండి విశాఖ రాజకీయాలను గుప్పిటిలో పెట్టుకోవాలని చూస్తున్న విజయసాయిరెడ్డికి జగన్ పూర్తి హక్కులు ఇచ్చేశారు. దీంతో అక్కడి ప్రతి అంశాన్ని విజయసాయిరెడ్డే నడిపిస్తున్నారు. ఈక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద విజయసాయి డామినేషన్ ఎక్కువైంది. స్థానికంగా ఎంపీ చూడాల్సిన వ్యవహారాలను, పరిష్కరించాల్సిన సమస్యలను విజయసాయే చూస్తుండటంతో ఎంపీకి సహించడంలేదు. విశాఖలో సింహాచలం పంచ గ్రామాల భూసమస్యలో ఆ ప్రాంతానికి ఎలాంటి సంబంధంలేని విజయసాయి పరిష్కార కమిటీలో కూర్చున్నారు.
అయితే స్థానిక ఎంపీ సత్యనారాయణకు మాత్రం ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారు. అవకాశం దొరికితే పైకి లేవలేని, విజయసాయిని డామినేట్ చేయాలని చూస్తున్నారు. ఎలాగూ కోటరీ సపోర్ట్ ఉండదు కాబట్టి సొంతంగానే ఏదైనా చేయాలని భావిస్తున్న ఆయనకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కలిసొచ్చే విషయంలా కనబడింది. తన జిల్లాలోనే స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి తానే తీవ్రంగా వ్యతిరేకిస్తే మైలేజ్ ఉంటుందని భావిస్తున్నారు ఆయన. అందుకే కేంద్రానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన హెవీ స్టేట్మెంట్ ఇచ్చారు.
శుక్రవారం స్టీల్‌ప్లాంట్ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం ప్రకటించి స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడానికి తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానన్నాని అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడేది లేదని కేంద్రం తన నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే స్టీల్‌ప్లాంట్ గేటు వద్దనే నిరాహార దీక్షకు కూర్చుంటానని సవాల్ విసిరారు. కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న ఎంపీ ఇలా ఒక్కసారి విశ్వరూపం చూపించడం చూసి జనమే కాదు వైసీపీ నేతలు కూడ విస్తుపోతున్నారు. ఎంపీ స్పీడు చూస్తుంటే విజయసాయిని డామినేట్ చేసి విశాఖలో పట్టు నిలుపుకోవడానికి దీన్నొక మంచి అవకాశంగా మలుచుకుని దూసుకుపోవాలని డిసైడ్ అయినట్టున్నారని చెవులు కొరుక్కుంటున్నారు.