బ్రేకింగ్ : కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి !

కరోనా మహమ్మారి మరో ప్రజాప్రతినిథిని బలిగొంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనాతో మృతి చెందారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. చల్లా రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చల్లా మృతిపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ భ్యులకు సానుభూతి తెలిపారు. కర్నూలు జిల్లా అవుకుకు చెందిన చల్లా రామకృష్ణా రెడ్డి ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత టీడీపీ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశారు. గతేడాది టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.ఆరు నెలల క్రితమే చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు