జ‌గ‌న్ అంటే ఆయ‌న‌కు ఉన్న అభిమానం అలాంటిది!

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌యాణిస్తున్న కారుకు వేలాడుతూ వ‌స్తోన్న ఆ తెల్ల చొక్కా వ్య‌క్తి ఎవ‌ర‌నుకున్నారు? చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి. చంద్ర‌గిరి ఎమ్మెల్యే. వైఎస్ కుటుంబం అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి వీరాభిమాని. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత విశ్వ‌స‌నీయుడు.

ఇచ్ఛాపురంలో పాద‌యాత్ర ముగించుకుని, శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తిరుప‌తికి చేరుకున్న సంద‌ర్భంగా రైల్వేస్టేష‌న్‌లో చెవిరెడ్డి ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం- జ‌గ‌న్ కారుతో పాటు ప‌ద్మావ‌తి అతిథిగృహానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌నిపించిన దృశ్యం అది. త‌న వాహ‌నాన్ని వ‌దిలేసిన చెవిరెడ్డి.. జ‌గ‌న్ కారుతో పాటు ఇలా వేలాడుతూ అతిథిగృహం వ‌ర‌కూ చేరుకున్నారు. జ‌గ‌న్‌తో పాటు వెంట ఉన్న‌ సెక్యూరిటీ గార్డులు కూడా ఆయ‌న‌ను వారించిన‌ప్ప‌టికీ వినిపించుకోలేదు. ప‌ర్య‌ట‌న మొత్తం చెవిరెడ్డి.. జ‌గ‌న్ వెంటే ఉన్నారు.