వైసీపీ ఐదో జాబితా… అద్భుతాలు లేవు కానీ…!

చాలా రోజుల సస్పెన్స్ తర్వాత వైసీపీ ఐదో జాబితా తాజాగా విడుదలైంది. అయితే ఐదో జాబితానే తుదిజాబితాగా ఆల్ మోస్ట్ అన్ని నియోజకవర్గాల విషయంలోనూ ఒక క్లారిటీకి వచ్చి విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ… ఇందులో కేవలం ఏడు చోట్లకు మాత్రమే ఇంచార్జీలను నియమించారు. అందులో 4 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఈ జాబితాను సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

తాజాగా వైసీపీ ఐదో జాబితా విడుదలైంది. ఇప్పటికే నాలుగు విడతలుగా 58 అసెంబ్లీ, 10 లోక్‌ సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకం చేపట్టిన వైసీపీ… ఇప్పుడు ఐదో విడతగా నాలుగు అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలకు ఇన్ ఛార్జ్ లను నియమించింది. దీంతో… 175 లోనూ 62.. 25 లోనూ 6 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియమించినట్లు అయ్యింది. కాగా… 3 నియోజకవర్గాలకు సిట్టింగులను కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఐదో జాబితా విషయానికొస్తే… ఎమ్మెల్యేలు మంత్రులుగా మారడమే ఇందులోని రోటీన్ స్పెషాలిటీ!! ఇందులో భాగంగానే మాజీ మంత్రి నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. నెల్లూరు అర్బన్ కి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనీల్… మంత్రిగా మూడేళ్ల పాటు జగన్ క్యాబినెట్ లో పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయులు స్థానంలో ఆయనను జగన్ నియమించారు.

ఇదే సమయంలో… మరో ఎమ్మెల్యేకూ ఈసారి ఎంపీ టిక్కేట్ లభించింది. ఇందులో భాగంగా… అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబుని మచిలీపట్నం పార్లమెంట్ కి ఇన్ చార్జ్ గా నియమించారు. ఇదే సమయంలో… అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని ఇన్ చార్జ్ గా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంటే.. దాదాపుగా ఒకే కుటుంబం నుంచి ఒకరు హస్తినకు, ఒకరు అసెంబ్లీకి అన్నమాట!!

ఇక ఇక అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జ్ గా నిన్నటివరకూ ఉన్న అరకు ఎంపీ మాధవిని మార్చి రేగం మత్స్య లింగానికి అవకాశం ఇచ్చారు. మాధవి నాన్ లోకల్ అంటూ స్థానిక వైసీపీ నేతలు రివర్స్ అవ్వడంతో ఆమెను మార్చాల్సి వచ్చింది. అయితే… మత్స్య లింగం మాత్రం పక్కా లోకల్! దీంతో ప్రస్తుతానికి మాధవిని హోల్డ్ లో ఉంచారు!

ఇదే క్రమంలో… కాకినాడ ఎంపీ సీటుకు ఇన్ చార్జ్ గా గతకొన్ని రోజుల నుంచి వస్తున్న ఊహాగాణాలను నిజం చేస్తూ చలమలశెట్టి సునీల్ ని నియమించారు. అదేవిధంగా… సత్యవెడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా నూకతోటి రాజేష్ ని నియమించారు. ఇక తిరుపతి ఎంపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ మద్దిల గురుమూర్తిని కంటిన్యూ చేస్తున్నారు.

కాగా… నాలుగవ జాబితాలో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా గురుమూర్తిని నియమించి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ ఇన్ చార్జ్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మార్పుతో ఏకీభవించిన ఆదిమూలం టీడీపీలోకి వెళ్ళిపోయారు! దీంతో… గురుమూర్తుని యధాతధంగా తిరుపతి ఎంపీ స్థానానికే కంటిన్యూ చేస్తున్నారు.