ఇద్ది ఈ దూకుడే కావాలి…బీజేపీ మీద వైసీపీ స్ట్రాంగ్ పవర్ ఫుల్ అస్త్రం ?

Nara Lokesh

2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో టీడీపీ హవా తగ్గడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి బీజేపీ టతీవ్రంగా ప్రయత్నిస్తుంది. వైసీపీ కి రానున్న రోజుల్లో ప్రధాన పోటీదారుడిగా మారడానికి బీజేపీ చేయాల్సిన అన్ని పనులు చేస్తుంది. బీజేపీ పెద్దలు కూడా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జెండా పాతేయడానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీపై కూడా గత కొన్ని రోజుల నుండి అవకాశం వచ్చిన ప్రతిసారి విరుచుకుపడింది. అయితే ఇప్పుడు వైసీపీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు బీజేపీ నాయకులు షాక్ అయ్యారు. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును వదిలి పెట్టాలని కోరుతూ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే నెల రోజుల తరువాత ఈ లేఖకు సమాధానం వచ్చింది.

వరవరరావు ప్రస్తుతం ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో బెయిల్‌ కూడా రాని చట్టం కింద జైల్లో ఉన్నారు. ఆయనకు నెల రోజుల కింద అనారోగ్యం సోకడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పుడే చాలా మంది సానుభూతిపరులు ఆయనను విడిచిపెట్టాలని అధికారంలో ఉన్న వారికి లేఖలు రాస్తున్నారు. ఇప్పుడు భూమనకు బీజేపీ నుండి వచ్చిన సమాధానం ఏంటంటే…ప్రధానిని హత్య చేయడానికి కుట్ర పన్నిన వ్యక్తినే వదిలేయమంటారా! అని బదులు వచ్చింది.

ఇలా రాజకీయ వ్యూహంతో బీజేపీ నాయకులు ఇచ్చిన బదులుకు వైసీపీ నాయకులు ఘాటుగానే సమాధానమిచ్చారు. బీజేపీ వేస్తున్న రాజకీయ వ్యూహాలను మొదట్లోనే చిత్తు చేయకపోతే రానున్న రోజుల్లో తమకు ఇబ్బందులు తప్పవని భావించిన భూమన బీజేపీకి షాక్ ఇచ్చే ప్రత్యుత్తరం పంపారు. తన లేఖ పార్టీకి సంబంధం లేదని, వ్యక్తిగతంగా రాశానని, ఆయనను విడుదల చేయమని కోరాను అంటే.. ప్రధానిపై గౌరవం లేదని కాదని తెలిపారు. ఇంతటితో ఆగని భూమన తాను కూడా ఆర్ఎస్ఎస్ కు చెందిన వాడినని, తనరాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్ లోనే ప్రారంభం అయ్యిందని చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడ భూమన ఎందుకు ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావించారనేది ఇప్పుడు రాజకీయ చర్చకు దారి తీస్తుంది. ప్రధానిని అగౌరవపరిచారని వైసీపీని బ్యాడ్ చేయడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులకు వైసీపీ నాయకులు ఇచ్చిన దెబ్బకు బీజేపీ పెద్దలు షాక్ అయ్యారు.