వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన…ఆ ఆరుగురు వీరే !

ycp

ఏపీ లో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని నిలబెట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

Will Jagan do justice for ycp activists?

చల్లా భగీరథరెడ్డి,
బల్లి కల్యాణ చక్రవర్తి,
సి.రామచంద్రయ్య,
మహ్మద్ ఇక్బాల్,
దువ్వాడ శ్రీనివాస్‌,
కరీమున్నీసా. 

అనంతపురం నేత ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశం లభించింది. అలాగే చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌ మరణించడంతో ఆయన కొడుకు బల్లి కళ్యాణ్‌ చక్రవర్తికి మండలిలో ఛాన్స్‌ ఇచ్చింది. కర్నూలు జిల్లాక చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఆయన కుమారుడు చల్లా భగీరథరెడ్డికి అవకాశం కల్పించ్చింది. ఇక విజయవాడ నుంచి కార్పొరేటర్‌ మహ్మద్‌ కరీమున్నీసాకు పార్టీ ఛాన్స్‌ ఇచ్చింది. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు, సీనియర్‌ నేత సీ రామచంద్రయ్యకు అవకాశం కల్పించింది. కాగా, మార్చి 29తో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.