ఆంధ్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకి కృష్ణాజిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత కృష్ణ ప్రసాద్ కు యుద్ధం మొదలయింది. మంత్రి ఉమ, కృష్ణ ప్రసాద్ వర్గాల మధ్య టెన్షన్ మొదలయింది. మంత్రి చేస్తున్న అక్రమాలను వెల్లడించేందుకు కృష్న ప్రసాద్ రంగంలోకి దిగారు. ఈ రోజు ఆయన పాత్రికేయులతో కలిసి పురగుట్ట ప్రాంతాన్ని మంత్రి చేసిన అక్రమాలను వివరించారు.
ఇళ్ళ పట్టాలు పంపిణీ పేరుతో మంత్రి దేవినేనీ ఉమా పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ఈ విషయాన్ని జన్మభూమిలో అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు సహయంతో అడ్డుకుంటున్నాడని కూడా ఆయన చెప్పారు. ఆరోపణల గురించి భయపడిన మంత్రి దేవినేనీ ఉమా తన అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని అన్నారు.
కృష్ణ ప్రసాద్ మంత్రి ఉమ మీద చేసిన ఆరోపణలు
#ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే లక్షలు విలువైన కలపను మంత్రి దేవినేనీ ఉమా తన అనుచరులతో కలిసి స్వాహ చేశారు.
#పేదల ఇళ్ళ పట్టాలు పంపిణీ కూడా ముందు నుండి కాకుండా వెనక వైపు నుండి మెదలు పెట్టి ముందు భాగంలో ఉన్న విలువైన భూమిని స్వాహ చేసేందుకు పధకం వేశారు.
#ఎటువంటి అనుమతులు లేకుండానే పేదలను మోసం చేసేందుకు జవాబు పత్రం పేరుతో పట్టాలు పంపిణీ చేస్తున్నాడు.
పురగుట్ట ప్రాంతం లో కలప కోసం నరికిన చెట్లను కూడా ఆయన విలేఖరులకు చూపించారు.
ఈ చెట్టను నరకడం పై అనంతరం మైలవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.