వైఎస్సార్ చేయూత స్కీమ్ గురించి తెలుసా.. ప్రతి మహిళ రూ.75 వేలు పొందే ఛాన్స్!

ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆ పథకాలలో వైఎస్సార్ చేయూత స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. 2019 సంవత్సరంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో భాగంగా ఒక్కో విడతలో రూ.18750 జమ కావడం జరుగుతుంది.

ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్న లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమవుతాయి. గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయ ఉద్యోగులను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. ఆధార్ కార్డ్ లోని వయస్సు ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

అడ్రస్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్, నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్లు వేర్వేరు వ్యాపారాలు చేయడానికి కూడా ప్రభుత్వం తమ వంతు సహాయసహకారాలు అందిస్తుండటం గమనార్హం.

లక్షల సంఖ్యలో లబ్ధిదారులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ ను పొందుతున్నారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఆర్థికంగా ఎంతగానో బెనిఫిట్ కలుగుతోంది. గ్రాఅమ, వార్డ్ వాలంటీర్లను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.