YS sharmila: టీడీపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్న వైఎస్ షర్మిల.. అన్నయ్యని టార్గెట్ చేస్తుందిగా?

YS sharmila: వైయస్ షర్మిల గతంలో జగన్మోహన్ రెడ్డి విజయానికి ఎంతో కీలకంగా మారారు.అయితే వీరిద్దరి మధ్య ఆస్తి విభేదాలు వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా కూడా అణగదొక్కే ప్రయత్నంలో వైఎస్ షర్మిల ఉన్నారని చెప్పాలి. గత ఎన్నికలలో భాగంగా ఇక్కడ ఈమె రాజకీయాలలోకి రావడమే కాకుండా ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు తీసుకొని వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేస్తూ వార్తల్లో నిలిచారు.

ఒక విధంగా ఎన్నికలలో జగన్ ఓటమికి షర్మిల కూడా కారణమని చెప్పాలి. ఇక జగన్ ఓటమిపాలైన తర్వాత షర్మిల ప్రతిపక్ష నేతగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ ఈమె మాత్రం తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ జగన్ పట్ల విమర్శలు చేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వానికి పచ్చ పత్రికలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయి.

ఇక షర్మిలకు కూడా ఇప్పుడు ఆ పత్రికల సపోర్ట్ లభించడంతో ఈమె జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని ఎలాగైనా తనని రాజకీయంగా అణగదొక్కా అనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం చూస్తుంటే ఈమె పూర్తిగా టీడీపీ ప్రతినిధిలా మారిపోయిందని స్పష్టమవుతుంది. ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు ఘాడితప్పాయి ఈ విషయాల గురించి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మరిచి ఈమె జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడం పట్ల పలువురు షర్మిల వ్యవహార శైలిపై మండిపడుతున్నారు.