అయిపాయె.! కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వైఎస్ షర్మిల.!

అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి వైఎస్ షర్మిల సమాయత్తమవుతున్నారు. ఇందుకుగాను, జాతీయ పార్టీ కాంగ్రెస్‌ని సరైన వేదికగా ఆమె మలచుకున్నట్టున్నారు.!

ఇదీ గత కొంతకాలంగా జరుగుతున్న చర్చ. త్వరలో, అతి త్వరలో.. షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీ,ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసెయ్యబోతున్నారట. ఇది తాజా ఖబర్. ముహూర్తం కూడా ఫిక్సయ్యిందని అంటున్నారు. జులై 8న విలీనం జరిగిపోతుందట.

కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయనీ, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. అసలెందుకు షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు.? ఇప్పుడెందుకు ఆ పార్టీని ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తున్నారు.?

పైగా, ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల యాక్టివ్ కాబోతున్నారన్న ప్రచారం కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. లేదూ, షర్మిల తెలంగాణ రాజకీయాల్లోనే వుంటారా.? మళ్ళీ అదో పెద్ద డౌటు.

షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ఏపీకి చెందిన కొందరు కాంగ్రెస్ ముఖ్యులు గత కొద్ది కాలంగా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయన్నది తాజా గాసిప్స్ సారాంశం. ఎవరు వాళ్ళు ఏంటా కథ.? ఇదంతా నిజమేనా.? జస్ట్ కొన్ని రోజులు వెయిట్ చేస్తే సరి.!