YS sharmila: జగన్ ను అరెస్ట్ చేయాలంటూ ఉన్న షర్మిల.. కౌంటర్ ఇచ్చిన వైసీపీ!

YS sharmila: అదానీ విద్యుత్ ఒప్పందంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతూ వైఎస్ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఎప్పుడైతే అదానీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన అప్పటినుంచి వైఎస్ షర్మిల ఏపీ గవర్నర్ ని కలవడం అలాగే చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాయడం జరిగింది.అదానీతో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలన్నింటిని రద్దు చేయాలని అలాగే ఆయన తీసుకున్న ముడుపుల గురించి కూడా సిబిఐ విచారణ చేయాలి అంటూ ఈమె డిమాండ్లు చేస్తున్నారు.

ఈ విధంగా షర్మిల వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటంతో వైకాపా మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చార్జిషీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోయినా ఉన్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి అదానీ నుంచి ముడుపు తీసుకున్నట్లు వైయస్ షర్మిలగాని, రాధాకృష్ణ లేదా రామోజీరావు కొడుకు గాని చూశారా అంటూ ప్రశ్నించారు.

అదానీ కేంద్ర ప్రభుత్వంతో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెకీతో వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత తక్కువ ధరకే 2.49 పైసలకే విద్యుత్తు కొనుగోలు చేసింది కానీ గతంలో చంద్రబాబు నాయుడు ఇదే సెకి ద్వారా 5.30 పైసలతో విద్యుత్ కొనుగోలు చేశారు అంటూ శివప్రసాద్ రెడ్డి తెలియచేశారు.

కేవలం షర్మిల తన వ్యక్తిగత కారణాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల పరంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఇక జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్న ఈమె చంద్రబాబు నాయుడు మోడీని కూడా అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేసే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టు పెట్టాలని ప్రశ్నించే గొంతుకను నొక్కేందుకు వీళ్ళు చట్టాలు తెస్తున్నారు. ప్రజల సమస్యలను మేము మాట్లాడుతున్నామని నల్ల చట్టాలను తీసుకువస్తున్నారు అంటూ శివప్రసాద్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.