YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పెద్ద ఎత్తున జిల్లాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల క్రితం ఈయన విజయవాడకు వెళ్లి జైలులో ఉన్నటువంటి వల్లభనేని వంశీని పరామర్శించి వచ్చారు అనంతరం నిన్న గుంటూరులో మిర్చి యార్డ్ కు వెళ్లి అక్కడ మిర్చి రైతులకు కష్టాలను చూసి రైతులకు ఏమాత్రం ప్రభుత్వం అండగా లేదంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక నేడు ఈయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఇలా జగన్మోహన్ రెడ్డి తిరిగి రాజకీయాలలో యాక్టివ్ అవుతూ ప్రజలలోకి వెళ్తూ ఉన్నారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇటీవల విజయవాడ జైలుకు వెళ్లడం గురించి వైయస్ షర్మిల స్పందిస్తూ తీవ్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు. అయితే తన పార్టీ నేతలు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే వెంటనే మూలాఖత్ లో భాగంగా జగన్ జైలుకు వెళ్లి వారిని పరామర్శిస్తూ వచ్చారు. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నందిగం సురేష్ లను కూడా పరామర్శించిన విషయం తెలిసిందే.
తాజాగా వల్లభనేని వంశీని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించడంతో షర్మిల మండిపడ్డారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై దాడులు దౌర్జన్యాలు చేసిన నేరస్తులు జైలుకు వెళ్తే వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తారు కానీ అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేదు అంటూ షర్మిల తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ చేసిన ఈ కామెంట్స్ సంచలనగా మారాయి.