వైస్ రాజశేఖర్ రెడ్డి వల్లే కియా మోటార్స్ వచ్చిందా ?

వైస్ రాజశేఖర్ రెడ్డి వల్లే కియా మోటార్స్ వచ్చిందా ?

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో కియా మోటార్స్ మీద ఒక ఆసక్తికర చర్చ జరిగింది. ముందుగా మాట్లాడిన వైస్సార్సీపీ సభ్యులు, చంద్ర బాబు హయంలో సుమారుగా 390 కోట్లు రూపాయలు ప్రత్యేక విమానాలు వాడి ప్రభుత్వ ధనం దుర్వినియోగ పరిచారు అని ఆరోపించారు. దీనికి చంద్రబాబు గారు సమాధానం చెబుతూ, తాను ఆలా తిరిగాము కాబట్టే అనేక ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయని, అందులో ప్రధానమైనది కియా మోటార్స్ అనంతపూర్ కి రావడం అని చెప్పారు. అలాగే దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షలు ఉద్యోగాలతో పాటు పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అగ్రీమెంట్లు కూడా అయ్యివున్నాయి అని తిప్పికొట్టడానికి ప్రయత్నించారు.

అయితే దీనికి సమాధానంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెద్ద్య్ మాట్లడుతూ, కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ రావడానికి ప్రధాన కారణం దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి కారణమని చెబుతూ కియా మోటార్స్ సీఈఓ మరియు ప్రెసిడెంట్ హాన్ వు పార్క్ రాసిన ఒక లేఖని చదివి వినిపించారు .

ఆ లేఖ జూన్ ఆరు 2019 సంవత్సరం జగన్ మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాత వ్రాసారు. సారాంశం ఏంటంటే 2017 లో హాన్ వు పార్క్ హ్యుండై మోటర్స్ ప్రతినిధిగా వున్న సమయంలో వైస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో హాన్ వు పార్క్ గారిని ఒక మోటార్ తయారీ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టమని కోరడం జరిగిందట. ఆ మాట నిలిబెట్టుకోవడం కోసమే కియా మోటార్స్ ఇండియా లో పెట్టిన తన మొదటి పెట్టుబడిని ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టామని చెప్పడం జరిగిందని చెప్పుకొచ్చారు. కాబ్బటి చంద్ర బాబు గారు కియా మోటర్స్ కి క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు ఆర్ధిక మంత్రి.