వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన సోదరుడు వైఎస్ ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఎవరిపైనా అనుమానాల్లేవన్నారు. వివేకా హత్యను సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న జగన్ వ్యాఖ్యలపై ఆయన మాట్లాడారు.
రాజకీయంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారని, సీబీఐ విచారణ కోరడం రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు కావొచ్చంటూ కొట్టిపడేశారు. రాజకీయాలతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. మైనింగ్ ఆర్థిక లావాదేవీల విషయంలో వివేకానందరెడ్డి తన ఇంటి ముందు ధర్నా చేయడం నిజమేనని, అయితే దీనికి హత్యకు ఎటువంటి సంబంధం లేదని ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.