YS Jagan: గత ఐదు సంవత్సరాల పాటు ఏపీలో బాధ్యతలను నిర్వహించి ముఖ్యమంత్రిగా కొనసాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో మాత్రం ఓటమిపాలు అయ్యారు అయితే ఇలా ఓటమి పాలు అయినప్పటికీ ఆయన అంటే అభిమానించే వారి సంఖ్య భారీగా ఉందని చెప్పాలి. అత్యంత ఆదరణ కలిగిన ప్రజానాయకుడిగా జగన్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. కానీ ఈయన ఓటమితో ఈయనకు క్రమక్రమంగా ఆదరణ తగ్గిపోతుందని తెలుస్తుంది.
గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ చేసిన లేదా ఒక వీడియోని విడుదల చేసిన భారీ స్థాయిలో ఆ పోస్టుకు వీడియోలకు ఆదరణ లభించేది అలాగే ఆయన చేసిన ట్వీట్లకు కొన్ని లక్షల్లో రీట్వీట్స్ వచ్చేవి. కానీ గత కొద్ది రోజులుగా జగన్ చేసిన ట్విట్స్ కు స్పందన రాలేదని పలువురు నేతలు తెలియజేస్తున్నారు. అయితే వీటిని కార్యకర్తలు రీట్వీట్ కానీ వైరల్ గా కానీ ఎక్కడ చేయడం లేదు.. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కార్యకర్తలు సైతం అరెస్టు అయ్యి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది భయపడి కూటమి ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకంగా పోస్టులను చేయటం లేదు.
ఇకపోతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ విషయంపై స్పందిస్తూ తాను చేసిన పోస్టులను ట్వీట్లను తిరిగి షేర్ చేయమని చెప్పినప్పటికీ కూడా అభిమానుల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు అందుకు కారణం ప్రస్తుతం వైకాపా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసే జైలుకు పంపిస్తున్న విషయమే కారణమని చెప్పాలి. ఇకపోతే ఇటీవల జగన్ తాను తిరిగి ప్రజలలోకి వస్తానని తెలిపారు..
సంక్రాంతి పండుగ తర్వాత ప్రతి జిల్లాలోనూ తాను రెండు రోజులపాటు బస చేస్తానని అక్కడ నాయకులు, కార్యకర్తలతో కలిసి కూటమి ప్రభుత్వ తీరు గురించి వారు చేస్తున్న అక్రమాల గురించి ప్రశ్నిస్తానని జగన్ తెలిపారు. ఇలా జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తున్నారంటే ఆయనకు ఎలాంటి క్రేజ్ ఉండేదో మనకు తెలిసింది కానీ ఇలా తానే జనంలోకి వస్తున్నాను అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు ఆదరణ తగ్గిపోతుందని తెలుస్తోంది.