వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసే, చేస్తున్న రాజకీయల గురించి అందరికి తెల్సు. రాజకీయాల్లో ఆయన వేసే ఎత్తుగడలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కొట్టుకుపోయారు. రాజకీయంగా ఆయన చేస్తున్న, చేసే ప్రతి పని వెనక ఒక రాజకీయ ఎత్తుగడ ఉంటుంది. చేసే ప్రతి పని నుండి ప్రజల యొక్క అభిమానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఆయన ప్రవేశపెట్టే అన్ని పథకాలు కూడా నేరుగా లబ్ధిదారులకు చేరేలా, కేవలం డబ్బుల రూపంలోనే ఉంటుంది. డబ్బులు ఇస్తేనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని గ్రహించిన వైఎస్ జగన్ వాళ్ళను డబ్బుతో కట్టిపడేయడానికి ప్రయత్నిస్తుంటారు.
రైతులకు ఉచిత సబ్సిడీ పథకాన్ని కూడా నగదు రూపంలో మార్చడం ఏపీలో చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి పదిహేను నెలలు కావస్తుంది. ఈ సమయంలో దాదాపు 3.5 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా నేరుగా నగదును లబ్దిదారుల ఖాతాల్లోకే చేర్చారు. వీటి విలువ దాదాపు 65 వేల కోట్లు ఉంటుందని అంచనా.
కొత్తగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతి పంపు సెట్ వద్ద విద్యుత్తు మీటరును బిగిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తును అందజేస్తుంది. ఈ సమయంలో రైతు ఎంత విద్యుత్తును అయినా వినియోగించుకోవచ్చు. ఇందులో షరతులు ఏమీ లేవు. అయితే దీనివల్ల రైతుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. రైతు ఎంత విద్యుత్తును వినియోగించుకున్నా ఆ సొమ్మును రైతు ఖాతాలోనే ప్రభుత్వం జమ చేయనుంది. ఏటా ప్రభుత్వం 8,400 కోట్లు సబ్సిడీ రూపంలో ఖర్చు పెడుతుంది. ఈ మొత్తం అంతా రైతుల ఖాతాల్లోనే జమ కానుంది. రైతుకు అదనంగా దీనివల్ల పడే భారముండదు. కేవలం విద్యుత్తు వినియోగంలో జవాబుదారీతనం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు తెలియకుండా వల్ల డబ్బులు చెల్లించే విధానాన్ని ఇప్పుడు మీకోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో అని చెప్పుకోవడానికి, ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తే వచ్చే ఇంపాక్ట్ ను కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాడుకోవాలని ట్రై చేస్తున్నారు.