టార్గెట్ చేసిన నాయకులకు బుద్ధి చెప్పడం జగన్ కు కొత్తేమి కాదు. 2019 ఎన్నికల్లోనే తాను టార్గెట్ చేసిన నాయకులను చెప్పి మరీ ఓడించారు. ఇప్పుడు తాజా తన సొంత పార్టీలొనే ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ ను టార్గెట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అవంతికి కోపం చాలా ఎక్కువ. మనసులో అనుకున్న మాట మొహమాటం లేకుండా ఇట్టే మొహం మీద చెప్పేస్తాడు. అయితే తాజా అతని కోపం వైసీపీ అధినేత, సీఎం జగన్ కుఆగ్రహం తెప్పించిందని, ఆ కోపానికి కళ్లెం వేయడానికి ఆల్రెడీ వ్యహం రచించారని తెలుస్తుంది. టీడీపీ అగ్రనేత, అవంతి శ్రీనివాస్ యొక్క రాజకీయ గురువైన గంటా శ్రీనివాస రావు ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.అయితే ఇది నచ్చని అవంతి ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గంటాను ఫిరాయింపు నేతని, ఆయనకు గోడలు దూకడం అలవాటని విమర్శలు చేస్తున్నారు.
గంటా శ్రీనివాస్ అవినీతిపరుడని, ఆయన మంత్రిగా ఉన్నపుడే విశాఖలో భూ కుంభకోణం జరిగిందని అలాంటి నేతను పార్టీలోకి తీసుకోవడం మంచిది కాదని అవంతి వైసీపీ పెద్దలకు సూచనలు చేస్తున్నారు. అయితే ఒక హద్దు దాటి అవంతి చేస్తున్న వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే ఖండిస్తున్నారు. గంటాను పార్టీలోకి తీసుకోవాలన్న నిర్ణయం తీసుకుంది జగన్ అని, ఆ నిర్ణయాన్ని అవంతి కాదనడం ఏంటని సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అవంతి శ్రీనివాస్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే ఎంపీ రఘురామ కృష్ణరాజుకు పట్టిన గతే పట్టుందని కొంత మంది వైసీపీ నేతలు చెప్తున్నారు. పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో, ఎవరిని తీసుకోకూడదో జగన్ కు బాగా తెలుసని, ఎవరైనా ఎదురు తిరిగితే కళ్లెం వేయగల సత్తా జగన్ ఉందని వైసీపీ నేతలు చెప్తున్నారు.