కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్ క్షమిస్తారా.?

వైఎస్ షర్మిల అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడవబోతున్నారనీ, కాంగ్రెస్ పార్టీతో వైఎస్ జగన్ సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారనీ. ఈ క్రమంలోనే ముందుగా వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్నారనీ టీడీపీ అను‘కుల’ మీడియా కథనాల్ని వండి వడ్డిస్తోంది.

వాస్తవానికి వైఎస్ షర్మిల రాజకీయం వేరు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయం వేరు. వైఎస్ జగన్ సోదరిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలను అందరూ గౌరవిస్తారు. కానీ, వైసీపీకి దూరంగా జరిగారామె. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ విభాగం బాధ్యతల్ని మొదట్లో ఆమె చేపట్టినా, ఆ తర్వాత రాజకీయాలకు దూరమై.. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీతో హంగామా తిరిగి ప్రారంభించారు.

షర్మిల రాజకీయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించలేదు. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రే కాదు, ధర్నాలు.. ఆందోళనలూ చేశారు షర్మిల. కానీ, పొలిటికల్ మైలేజ్ అయితే దక్కించుకోలేకపోయారు. ఇక రాజకీయ పార్టీని నడపలేనన్న నిర్ణయానికి వచ్చి, కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని కలిపేస్తున్నారు.

కానీ, వైఎస్ జగన్ పరిస్థితి వేరు. ఆయనిప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగారు. ఆయనెందుకు కాంగ్రెస్ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. పైగా, కాంగ్రెస్ పార్టీని షర్మిల క్షమించేసినట్లు, వైఎస్ జగన్ క్షమించేయలేరు.!

కాంగ్రెస్ పార్టీలో జగన్ ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు.! షర్మిల ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారన్నది ఆమె వ్యక్తిగతం. దాన్ని వైఎస్ జగన్‌తో ముడిపెట్టడం సబబు కాదు.!

#@AK News World వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులం అందరం కాంగ్రెస్ పార్టీని క్షమించాలి - వైఎస్ షర్మిల