ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజాపా దాగుడుమూతలు ఆడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీకి ఒక రూపు రేఖలు, ఖచ్చితమైన కేడర్ లేకపోవడంతో బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. కేంద్రం కూడ ఏపీలో ఏం చేసినా వచ్చే లాభం, కలిగే నష్టం ఏమీ లేదు కాబట్టి డబుల్ గేమ్ ఆడుతున్నారు. ప్రధానంగా అమరావతి విషయంలో ద్వంద విఆఖరిని అవలంబిస్తున్న బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలను చూసి జనం తికమకపడిపోతున్నారు. జనమే కాదు రాజకీయ పార్టీలు కూడ అదే స్థితిలో కొట్టుకుంటున్నారు. మామూలుగా అయితే బీజేపీని పట్టించుకోవాల్సియాన్ పనే లేదు. కానీ కేంద్రంలో వారి ప్రభుత్వమే ఉంది కాట్టి ఇక్కడ బీజేపీ శాఖ తీరును బట్టి పైనున్న నాయకుల ఉద్దేశ్యాలను, ఆలోచనలను, వ్యూహాలను అంచనా వేయవచ్చని అందరూ అనుకున్నారు. ఆ ప్రకారమే బీజేపీ వైఖరి గమనిస్తే కేంద్రం కూడ ఏపీ విషయంలో రెండు నాల్కల ధోరణిలోనే ఉందని అవగతమైంది.
ఇక కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి పనులు జరుపుకోవాలని అనుకున్న జగన్ మొదట్లో బీజేపీని లైట్ తీసుకున్నారు. మనకు పని కేంద్రంతో కానీ రాష్ట్ర శాఖతో కాదని అనుకున్నారు. అందుకే బీజేపీ ఏం మాట్లాడిన, ఎన్ని విమర్శలు చేసినా వారి పేరును ప్రస్తావించలేదు. కానీ ఊరుకునేకొద్ధి తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర బీజేపీ శాఖ కూడ కాసేపు అటు ఇంకాసేపు ఇటు అన్నట్టు వ్యవహరిస్తూ అదే పనిగా ముఖ్యమంత్రి మీద విమర్శలు స్టార్ట్ చేసింది. తాజాగా సోము వీర్రాజు రాయలసీమకు వెళ్లి జగన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లు అమరవతి విషయంలో నోరు మెదపని వారు ఇప్పుడు కె రాజధాని కావాలని అది కూడ అమరావతి అయ్యుండాలి అంటున్నారు.
దీంతో జగన్ కు చిర్రెత్తుకొచ్చింది. కాసేపు అటు, ఇంకాసేపు ఇటు. ఇదేం పద్దతి, వీళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అనుకున్నారో ఏమో కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు మెలిక పెట్టేసి వచ్చారు. అదేమిటంటే హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియ మొదలుపెట్టమని అడగడం. బీజేపీ గతంలో మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అనే అంశాన్ని ఉంచారు. దాన్నే పట్టుకున్న జగన్ అమిత్ షాతో మీరు అనుకున్న, మేనిఫెస్టోలో పెట్టిన కర్నూలులో హైకోర్టు అనే అంశాన్ని మేము పూర్తిచేయాలని అనుకుంటున్నాం. మీ సహకారం కావలి. వెంటనే తరలింపు ప్రక్రియ మొదలుపెట్టండి అంటూ అమిత్ షాను కోరారు. బీజీపీ మేనిఫెస్టోలో కర్నూలు విషయం ఉంది. దీంతో అమిత్ షా లాక్ అయిపోయారు. ఇప్పుడు హైకోర్టు తరలింపుకు ఒకే చెబితే అమరావతిని విస్మరించినట్టే. ఒకవేళ హైకోర్టు కర్నూలులో వద్దని అంటే తమ మేనిఫెస్టో మొత్తం ఫేక్ అని ఒప్పుకోవాలి.
ఎలాగూ మేనిఫెస్టో తప్పని ఒప్పుకోలేరు కాబట్టి హైకోర్టు తరలింపుకు ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉంది. అలా జరిగితే మాత్రం అమరావతిని కాపాడుతాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ తిరుగుతున్న సోము వీర్రాజు బ్యాచ్ కు తుక్కు రేగిపోతుంది జనం చేతిలో.