జగన్మోహన్ రెడ్డి అను నేను

దాదాపు పదేళ్ళ పాటు వెయిట్ చేసిన క్షణాలు వచ్చేశాయి. ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సింపుల్ గా జరిగిన ఓ ఫంక్షన్లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి కెసియార్ తో పాటు తమిళనాడు నుండి ఎంకె స్టాలిన్ కూడా హాజరయ్యారు. మున్సిపల్ స్టేడియంలో గ్యాలరీలన్నీ మామూలు జనాలతో నిండిపోతే గ్రౌండ్ మాత్రం వైసిపి ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, పార్టీ సీనియర్ నేతలు, వివిఐపిలతో నిండిపోయింది.

12.15 నిముషాలకు గ్రౌండ్లోకి అడుగుపెట్టిన జగన్ ఓపెన్ టాప్ జీపులో అందరికీ అభివాదం చేసుకుంటు వేదిక దగ్గరకు వచ్చారు. సరిగ్గా 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 5 నిముషాల్లో ముగిసిన ప్రమాణ స్వీకార ఘట్టం తర్వాత గవర్నర్ దంపతులు వెళ్లిపోయారు. ఆ తర్వాత సర్వమత ప్రార్ధనలు జరిగాయి.