ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. జిల్లాల్లోని ఫిషరీస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ జిల్లా వాసుల చిర కాల కోరిక తీరబోతుంది. కొన్నేళ్లగా జిల్లాల్లో షిషరీస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని అక్కడి వాసులు కోరుతున్నారు. రాష్ర్టంలోని గోదావరి, విశాఖ జిల్లాల్లోనే అధికంగా మత్సకారులున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలోనూ జిల్లా వాసులు పలు మార్లు వినతి పత్రాలు అందించడం జరిగింది.
కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి జగన్ అధికారంలోకి రావడంతో జిల్లా వాసుల కల నెరవేరుతోంది. దీనికి సంబంధించిన ఏపీ ఫిషరీస్ ఆర్డినెస్ -2020 జారీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. యూని వర్శిటీ ఏర్పాటు ద్వారా మత్స రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని..ఆ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని జగన్ సర్కార్ భావిస్తోంది. రాబోయే ఐదేళ్లలో 300 కోట్ల రూపాయలు యూనివర్శీటి కోసం ఖర్చు చేయనున్నారు. ఇక నిపుణుల కొరత వల్ల ఆక్వా రంగం ఏడాది కి 2500 కోట్ల రూపాయలు నష్టపోతుంది. రాబోయే రోజుల్లో ఈ నష్టాన్ని అధిగమించొచ్చని ప్రభుత్వ అధికారులు ధీమా వ్యక్తం చేసారు.
ప్రత్యక్షంగా 90 వేల మంది రైతులు, పరోక్షంగా 8 లక్షల ఆక్వారైతులు ప్రయోజనం పొందనున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వెనుక మతలబు ఏదైనా ఉందా? అంటే రాజధాని తరలింపు నేపథ్యంలోనే జగన్ యూనివర్శిటీ ని తెరపైకి తీసుకొస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఆ జిల్లా వాసుల మెప్పు కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండిపడు తున్నారు. రాష్ర్టంలో చాలా జిల్లాల్లో ఆక్వా రైతులు..మత్సకారులు ఉన్నారని అక్కడ ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.